05-03-2025 12:05:39 AM
మంచిర్యాల, మార్చి 4 (విజయక్రాంతి) : ఉమ్మడి కరీంనగర్ - ఆదిలాబాద్ - మెదక్ - నిజామాబాద్ ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థి మల్కా కొమురయ్య విజయాన్ని పురస్కరించుకొని మంగళవారం జిల్లా కేంద్రంలో బిజెపి నాయకులు సంబరాలు నిర్వహించారు. బీజేపీ జిల్లా ప్రధాన కార్యదర్శి దుర్గం అశోక్, మంచిర్యాల పట్టణ అధ్యక్షులు అమిరిశెట్టి రాజ్ కుమార్ ఆధ్వర్యంలో జిల్లా కార్యాలయం వద్ద టపాకాయలు కాల్చి మిఠాయిలు పంచిపెట్టారు.