calender_icon.png 6 March, 2025 | 12:12 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

బీజేపీ సంబురాలు.. పాల్గొన్న బండి సంజయ్

05-03-2025 01:02:23 AM

కరీంనగర్, మార్చి 4 (విజయబ్రాంతి): కరీంనగర్-మెదక్-నిజామాబాద్ -అదిలాబాద్ ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీజేపీ అభ్యర్ధి మల్క కొమురయ్య విజయం సాధించడంతో మంగళవారం బీజేపీ శ్రేణులు సంబరాలు జరుపుకున్నారు. నంబరాల్లో కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ పాల్గొన్నారు.

తొలుత అంబేడ్కర్ విగ్రహానికి ఎమ్మెల్సీ మల్క కొమురయ్యతో కలిసి బండి సంజయ్ పూలమాల సమర్పించి నివాళులర్పించి అనంతరం విజయోత్సవ ర్యాలీలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఆనాడు బీఆర్‌ఎస్ ప్రభుత్వం, సీఎం కేసీఆర్ ఉపాధ్యాయ లోకానికి 317 జీవో ద్వారా అన్యాయం చేయడంతో వారికి అండగా నిలబడి పోరాటం చేయడంతో ఉపాధ్యాయ లోకం బీజేపికి అండగా నిలబడిందని అన్నారు.

ప్రస్తుత ప్రభుత్వం, గత ప్రభుత్వం ఉద్యోగ, ఉపాధ్యాయుల పట్ల చూపిస్తున్న వివక్షతను బీజేపీ తిప్పికొడుతూ వారికి అండగా నిలుస్తుందన్నారు. ఈ ర్యాలీలో బీజేపీ జిల్లా అధ్యక్షుడు గంగాడి కృష్ణారెడ్డి, పార్లమెంటరీ కన్వీనర్ ప్రవీణ్  రావుతోపాటు ఉపాధ్యాయ తపన్ సంఘం నాయకులు, బీజేపీ నాయకులు పెద్ద సంఖ్యలో పాల్గొని స్వీట్లు పంపిణీ చేశారు.