calender_icon.png 4 March, 2025 | 10:08 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఉపాధ్యాయ ఎమ్మెల్సీ గెలుపుతో బిజెపి సంబరాలు

04-03-2025 07:35:49 PM

కాటారం (విజయక్రాంతి): కరీంనగర్, నిజామాబాద్, మెదక్, ఆదిలాబాద్ ఉమ్మడి జిల్లాల పరిధిలో జరిగిన ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికలలో బిజెపి, తెలంగాణ ప్రాంత ఉపాధ్యాయ సంఘం బలపరిచిన అభ్యర్థి మల్క కొమురయ్య విజయం సాధించిన సందర్భంగా భారతీయ జనతా పార్టీ సంబరాలు నిర్వహించింది. మంగళవారం జయశంకర్ భూపాలపల్లి జిల్లా కాటారం మండల కేంద్రంలో బాణాసంచా కాల్చి విజయోత్సవ సంబరాలు జరిపారు. ఈ సందర్భంగా జరిగిన కార్యక్రమానికి పెద్దపెల్లి జిల్లా బిజెపి మాజీ అధ్యక్షులు చందుపట్ల సునీల్ రెడ్డి మాట్లాడుతూ భారతీయ జనతా పార్టీకి ప్రజల ఆదరాభిమానాలు పెరుగుతున్నాయనడానికి ఎమ్మెల్సీ విజయమే నిదర్శనమని పేర్కొన్నారు.

కరీంనగర్ ఎంపీ, కేంద్ర మంత్రి బండి సంజయ్ నాయకత్వంలో ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో బిజెపి పార్టీ విస్తృతంగా ప్రజల్లోకి వెళ్లిందని అన్నారు. రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో బిజెపి తన ఆదిత్యాన్ని ప్రదర్శిస్తోందని ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో భారతీయ జనతా పార్టీ మండల అధ్యక్షుడు పాగె రంజిత్ కుమార్, ఫిల్మ్ సెన్సార్ బోర్డు మెంబర్ దుర్గం తిరుపతి, జిల్లా కౌన్సిల్ మెంబర్ బొమ్మన భాస్కర్ రెడ్డి, మాజీ మండల అధ్యక్షుడు బండం మల్లారెడ్డి, పలిమల మండల ఇంచార్జీ పిల్లమారి సంపత్, మల్హర్ మండల కన్వీనర్ ఆత్మకూరి స్వామి యాదవ్, నాయకులు డోలి అర్జయ్య, మంత్రి సునీల్, జిల్లెల శ్రీశైలం, చీర్ల అశోక్ రెడ్డి, వింజమూరు సదానందం, పాడి నరేష్, గుండ తిరుపతి తదితరులు పాల్గొన్నారు.