calender_icon.png 6 March, 2025 | 8:06 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఎమ్మెల్సీల గెలుపుతో ఆదిల్ పేటలో బిజెపి సంబరాలు

06-03-2025 04:29:39 PM

మందమర్రి (విజయక్రాంతి): ఉమ్మడి కరీంనగర్ మెదక్ నిజామాబాద్ ఆదిలాబాద్ నియోజకవర్గాల ఉపాధ్యాయ ఎమ్మెల్సీ పట్టభద్రుల ఎమ్మెల్సీలుగా బిజెపి అభ్యర్థులు మల్క కొమురయ్య, చిన్నమైలు అంజిరెడ్డిలు భారీ విజయం సాధించడంతో హర్షం వ్యక్తం చేస్తూ బిజెపి నాయకులు సంబరాలు నిర్వహించారు. మండలంలోని ఆదిల్ పేటలో గురువారం బిజెపి నాయకులు టపాసులు పేల్చి స్వీట్లు పంపిణీ చేసి సంబరాలు నిర్వహించారు. ఈ సందర్బంగా సీనియర్ నాయకులు దేవరనేని సంజీవరావు, మండల అధ్యక్షులు గిర్నాటి జనార్ధన్ లు మాట్లాడారు.

రానున్న స్థానిక ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ మండలంలోని అన్ని గ్రామపంచాయతీలను గెలుచుకునే దిశగా పార్టీ నాయకులు కార్యకర్తలు పనిచేస్తున్నారని మండలంలో భారతీయ జనతా పార్టీ బలపడుతుందని ప్రజల్లో ఆదరణ పెరిగిందని రానున్న ఎన్నికల్లో మండలంలో కాషాయ జెండా రెపరెప లాడటం ఖాయమని వారు ధీమా వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో బిజెపి నాయకులు మాజీ ఉప సర్పంచులు దారవేణి రవికుమార్, కర్రే రాజయ్య, పెంచాల రంజిత్, దుర్గం మల్లేష్, నామసాని శేఖర్, మారిశెట్టి దేవేందర్, చిందం కుమార్, కంది ముకుందరెడ్డి, తైదల మారుతి, సిద్ధం శ్రీనివాస్, సుంకరి ప్రవీణ్, దశరథం గౌడ్, దుర్గం రాజయ్య, తైదల సాయి కృష్ణ, లు పాల్గొన్నారు