06-03-2025 10:19:41 PM
బిజెపి రాష్ట్ర నాయకులు ప్రముఖ సైంటిస్ట్ పైడి ఎల్లారెడ్డి..
ఎల్లారెడ్డి (విజయక్రాంతి): ఉమ్మడి నిజామాబాద్, కరీంనగర్, మెదక్, అదిలాబాద్ పట్టభద్రుల ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ ఘన విజయం సాధించిన కారణంగా కామారెడ్డి జిల్లా ఎల్లారెడ్డి పట్టణ కేంద్రంలో బిజెపి పార్టీ కార్యాలయంలో బిజెపి రాష్ట్ర నాయకులు, ప్రముఖ సైంటిస్ట్, పైడి ఎల్లారెడ్డి విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... బిజెపి ఎమ్మెల్సీ అభ్యర్థులు గెలుపు బిజెపి కార్యకర్తల కష్టపడిన ఫలితమేనని అన్నారు. అంబేద్కర్ విగ్రహానికి పూలమాలవేసి బైక్ ర్యాలీ ప్రారంభించి అక్కడినుండి శివాజీ విగ్రహానికి పూలమాలవేసి బైక్ ర్యాలీ ముగించినట్లు ఆయన తెలిపారు.
బిజెపి పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థి అంజి రెడ్డి గెలుపు ప్రతి ఒక్క బీజేపీ కార్యకర్త గెలుపు అని అన్నారు, అలాగే 41 నియోజకవర్గాల్లో భారతీయ జనతా పార్టీ ఆదిత్యం కనబరిచి 40% తెలంగాణ కాషాయం అయిందని రానున్న ఎన్నికల్లో భారీ మెజారిటీతో బిజెపి గెలుస్తూ, తప్పకుండా తెలంగాణ రాష్ట్రం కాషాయ మాయం అవుతుందని ఈ సందర్భంగా బిజెపి రాష్ట్ర నాయకులు పైడి ఎల్లారెడ్డి తెలిపారు. భారతీయ జనతా పార్టీకి ఓటు వేసిన ప్రతి ఒక్కరికి, పార్టీ కోసం పనిచేసిన గ్రామ కార్యకర్తలకు మండల నాయకులకు, జిల్లా నాయకులకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ఎల్లారెడ్డి మండల అధ్యక్షులు నర్సింలు, రాజేష్, లింగంపేట్ మండల అధ్యక్షులు క్రాంతి కుమార్, జిల్లా గిరిజన మోర్చా ప్రధాన కార్యదర్శి నరేష్ నాయక్ మండల నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.