03-03-2025 10:18:44 PM
జిల్లా వ్యాప్తంగా బిజెపి తపస్ నాయకుల సంబరాలు..
కామారెడ్డి (విజయక్రాంతి): కరీంనగర్ అదిలాబాద్ మెదక్ నిజామాబాద్ టీచర్ ఎమ్మెల్సీగా భారతీయ జనతా పార్టీ అభ్యర్థి మల్కా కొమరయ్య విజయం సాధించారు. మొదటి ప్రాధాన్యత ఓట్లతో ఆయన విజయం సాధించారు. దీంతో కామారెడ్డి జిల్లా వ్యాప్తంగా భారతీయ జనతా పార్టీ శ్రేణులు సంబరాలు జరుపుకున్నారు. అనంతరం భారతీయ జనతా పార్టీ జిల్లా అధ్యక్షుడు నీలం చిన్న రాజులు, తపస్ జిల్లా అధ్యక్షుడు పులగం రాఘవరెడ్డిలు మాట్లాడుతూ... బిజెపి అభ్యర్థి టీచర్స్ ఎమ్మెల్సీ కొమురయ్య గెలుపునకు కృషిచేసిన ప్రతి ఒక్క కార్యకర్తకు అభినందనలు తెలిపారు. ఈ విజయం పరంపర ఇలాగే కొనసాగాలని పార్టీ శ్రేణులకు జిల్లా బిజెపి అధ్యక్షుడు నీలం చిన్న రాజులు పిలుపునిచ్చారు.
కామారెడ్డి జిల్లా కేంద్రంతో పాటు ఎల్లారెడ్డి బాన్సువాడ బిచ్కుంద జుక్కల్ గాంధారి పిట్లం లింగంపేట్ దోమకొండ రామారెడ్డి మండల కేంద్రాల్లో బిజెపి నాయకులు టపాసులు కాల్చి స్వీట్లు పంచుకొని సంబరాలు జరుపుకున్నారు. తపస్ జిల్లా అధ్యక్షుడు రాఘవరెడ్డి జిల్లాలోని ఉపాధ్యాయులందరికీ ఎమ్మెల్సీగా కొమురయ్య గెలుపుకు కృషి చేసిన ప్రతి ఒక్కరికి పేరుపేరునా ధన్యవాదాలు తెలిపారు. ఉపాధ్యాయుల సమస్యల పరిష్కారం బిజెపితోనే సాధ్యమని ఉపాధ్యాయులు గ్రహించడం అభినందనీయమన్నారు. కొమురయ్య గెలుపు ఉపాధ్యాయు లు నిస్వార్ధంగా నిక్కచ్చిగా ఓటు వేసి గెలిపించాలని రాఘవరెడ్డి తెలిపారు.
తపస్ జిల్లా కార్యదర్శి రచ్చ శివకాంత్ ఆధ్వర్యంలో బిచ్కుంద లో టపాకాయలు కాల్చి స్వీట్లు పంచిపెట్టారు, ఈ సందర్భంగా జిల్లా కార్యదర్శి రచ్చ శివకాంత్.మాట్లాడుతూ కొమురయ్య గెలుపు చరిత్రలో నిలిచే విధంగా ఉపాధ్యాయులు ఓటు వేసి గెలిపించారన్నారు. ఎమ్మెల్సీ కొమురయ్య గెలుపు కోసం కష్టపడ్డ ప్రతి ఉపాధ్యాయునికి పేరుపేరునా ధన్యవాదాలు తెలిపారు ఈ కార్యక్రమంలో ఎన్నవార్ రాజకుమార్ మండల తపస్ కార్యదర్శి ముత్యాల సందీప్ అనిల్ రెడ్డి జుక్కల్ మండలాధ్యక్షుడు జయ చందు కార్యదర్శి పత్తి సందీప్ ఎన్నో వార్ జనార్దన్ తదితరులు పాల్గొన్నారు.