13-02-2025 12:05:53 AM
యాదాద్రి భువనగిరి, ఫిబ్రవరి 12 (విజయక్రాంతి) ః త్వరలో జరగబోయే ఎమ్మెల్సీ ఎన్నికల్లో ప్రతి కార్యకర్త కంకణ బద్ధులై పని చేయాలని నల్గొండ ఖమ్మం వరంగల్ ఉపాధ్యాయ ఎమ్మెల్సీ బిజెపి పార్టీ ఇన్చార్జ్ అభ్యర్థి శ్రీనివాస్ రెడ్డి కోరారు.
బిజెపి జిల్లా పార్టీ కార్యాలయంలో ఎమ్మెల్సీ ఎన్నికల అసెంబ్లీ కన్వీనర్ చందా మహేందర్ గుప్తా అధ్యక్షతన జరిగిన కార్యకర్తల సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఉపాధ్యాయులను రెండు మూడుసార్లు కలిసి మద్దతు కోరాలని, దేశంలోని మేధావివర్గమంతా ప్రధాని నరేంద్ర మోడీ పక్షాన ఉన్నారని అన్నారు.
మేధావులైన ఉపాధ్యాయులు సైతం బిజెపికి మద్దతు ఇస్తున్నారని, ఇటీవల ప్రవేశపెట్టిన బడ్జెట్ మధ్యతరగతి వారికి అనుకూలంగా ఉందని అన్నారు ఈ నేపథ్యంలో దేశానికి నరేంద్ర మోడీ నాయకత్వం ఎంతో అవసరం అనేది మేధావి వర్గం గుర్తించారని శ్రీనివాస్ రెడ్డి పేర్కొన్నారు. కార్యకర్తలు దీక్షతో పనిచేసి పార్టీ అభ్యర్థి పులి సర్వోత్తమ్‌రెడ్డిని గెలిపించాలని కోరారు.
సమావేశంలో ఎమ్మెల్సీ భువనగిరి నియోజకవర్గ పార్టీ ఇంచార్జ్ వట్టిపల్లి శ్రీనివాస్‌గౌడ్ మాజీ ఎంపీ బూరనర్సయ్యగౌడ్ పార్టీ సీనియర్ నాయకులు గూడూరు నారాయణరెడ్డి, పోతంశెట్టి రవీందర్, సిఎన్ రెడ్డి, పడమటి జగన్మోహన్రెడ్డి, నల్ల నర్సింగ్‌రావు, మాయ దశరథ, ఏలే చంద్రశేఖర్, డిఎల్‌ఎన్ గౌడ్, వై జయంతి, పట్నం కృష్ణ, సుదర్శన్, సురేష్, ప్రభాకర్, శైలేష్, రాజు తదితరులు పాల్గొన్నారు.