14-04-2025 12:00:00 AM
కేంద్రంలో బీసీలకు ప్రత్యేక మంత్రిత్వ శాఖ ఏర్పాటు చేయాలి
ముషీరాబాద్, ఏప్రిల్ 13 (విజయ క్రాంతి): బీసీ కులాల వ్యతిరేక పార్టీగా బిజేపి మారిందని బీసీ జన చైతన్య వేదిక, మండల్ ఆశయ సాధన సమితి ( ఎం ఏ ఎస్ ఎస్) వ్యవస్థాపక అధ్యక్షుడు డాక్టర్ దాసరి అజయ్ కుమార్ యాదవ్ అన్నారు. ఆదివా రం బషీర్ బాగ్ ప్రెస్ క్లబ్ లో బీసీ జన చైత న్య వేదిక, మండల్ ఆశయ సాధన సమితి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన బీపీ మండల్ 43వ వర్ధంతి సభకు ముఖ్యఅతిథిగా డాక్టర్ దాసరి అజయ్ కుమార్ యాదవ్ పాల్గొన్నా రు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కేంద్రంలో బీసీలకు ప్రత్యేక మంత్రిత్వ శాఖ ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు.
కాంగ్రెస్ పార్టీకి బీసీల ప్రేమ ఉంటే రాష్ట్రం లో బీసీని సీఎం చేయాలన్నారు. బీపీ మండ ల్ జయంతిని పురస్కరించుకొని ఆగస్ట్ 25 ,2025 నుంచి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మండల్ రథయాత్ర ప్రారంభిస్తున్నామన్నా రు. తెలంగాణ రాష్ట్రంలో మరో మండల్ ఉద్యమం బోతుందన్నారు.ఈ ఉద్యమంలో బీసీ,ఎస్సీ, ఎస్టీ ,మైనార్టీ కులాల ప్రజలను కలుపుకొని తెలంగాణ రాష్ట్రంలో బీసీని ముఖ్యమంత్రి చేసే వరకు ఉద్యమం చేస్తామన్నారు.
కార్యక్రమంలో బహుజన్ ముక్తి పార్టీ జాతీయ అధ్యక్షుడు దాసురామ్ నాయక్, బీసీ జన చైతన్య రాష్ట్ర అధ్యక్షుడు బక్కన్న యాదవ్,ప్రధాన కార్యదర్శి పెంట రమేష్,ప్రచార కార్యదర్శి అనిల్,తెలంగాణ మండల్ ఆర్మీ శివ శంకర్ యాదవ్,సుబ్బ య్య, ఆర్ జే డీ పార్టీ నాయకులు శోభా యాదవ్,రాములు యాదవ్,బీసీ జన చైత న్య వేదిక నాయకులు శ్రీనివాస్ యాద వ్,పె ద్దన్న యాదవ్ ,గోపాల్, బీసీ జన చైతన్య వేదిక, మండల్ ఆశయ సాధన సమితి రాష్ట్ర నాయకులు తదితరులు పాల్గొన్నారు.