calender_icon.png 24 February, 2025 | 4:17 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

రేవంత్‌కు రక్షణ కవచంగా బీజేపీ

24-02-2025 12:50:45 AM

  1. ఆ పార్టీలో చేరతానని హామీ ఇచ్చారు..
    1. అందుకే కేంద్రం రేవంత్‌ను కాపాడుతోంది: బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్
    2. ఆ పార్టీలో చేరతానని హమీ ఇచ్చారు..
    3. అందుకే కేంద్రం రేవంత్‌ను కాపాడుతోంది 
    4. బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్

హైదరాబాద్, ఫిబ్రవరి 23 (విజయక్రాంతి): కాంగ్రెస్ సీఎం అయిన రేవంత్‌రె డ్డికి బీజేపీ రక్షణ కవచంగా నిలుస్తోందని బీ ఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఒక ప్రకటనలో ఆరోపించారు. రాజకీయంగా ఢిల్లీలో కొట్లాడుతూ తెలంగాణలో మాత్రం బీజేపీ.. కాంగ్రెస్ రేవంత్‌రెడ్డికి కాపు కాస్తోందన్నారు. ఇక్కడి కాంగ్రెస్ ప్రభుత్వం, సీఎం రేవంత్‌రెడ్డి అనేక స్కాములకు పాల్పడుతున్నా, కేంద్రం ఇప్పటిదాకా కనీసం స్పందించలేదన్నారు.

ఒకప్పుడు కాళేశ్వరం ప్రాజెక్టు ప్రమాదంపైన ఆగమేఘాల మీద స్పందించి కేంద్ర ప్రభుత్వ సంస్థలను రంగంలోకి దించి, విచారణల పేరుతో వేధింపులకు గురిచేసిందన్నారు. ఇ క్కడి కాంగ్రెస్ ప్రభుత్వ ఆధ్వర్యంలో సుంకిశాల ప్రాజెక్టులో రిటైనింగ్ వాల్ కూలిన ప్ర మాదంతో పాటు తాజాగా ఎస్‌ఎల్బీసీ సొ రంగంలో జరిగిన పెను ప్రమాదాలపైన కనీ సం స్పందించడం లేదన్నారు. దేశవ్యాప్తంగా రాహుల్ గాంధీ బీజేపీపై విమర్శలు చేస్తూ పోరాటం చేస్తున్నానని చెప్పుకొని తిరుగుతుంటే.. తెలంగాణలో మాత్రం కాంగ్రెస్ బీజేపీ కలిసి పనిచేస్తున్నాయని ఆరోపించారు.

అమృత్ నిధులు కట్టబెట్టినా చర్యలేవి..

అమృత్ పథకంలో భాగంగా కేంద్రం రాష్ట్రానికి రూ.1,337 కోట్లు ఇస్తే ఆ నిధులను సీఎం రేవంత్‌రెడ్డి తన సొంత బావ మరిదికి అప్పనంగా కట్టబెట్టారని, ఈ స్కా మ్ వివరాలను కేంద్రానికి అందజేసినా కనీసం స్పందించడం లేదన్నారు. తెలంగాణలోని కాంగ్రెస్ ప్రభుత్వం రియల్ ఎస్టేట్ నిర్మాణరంగ సంస్థల నుంచి చదరపు అడుగుకి రూ.150 చొప్పున రేవంత్‌రెడ్డి, రాహుల్ గాంధీలతో పేరుతో ఆర్‌ఆర్ టాక్స్ రూపంలో పన్ను వసూలు చేస్తుందని స్వయంగా ప్రధాని మోదీ ఆరోపించిన అంశంపై ఇప్పటిదాకా బీజేపీ తిరిగి ఒక్క మాట కూడా మా ట్లాడలేదని అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వంలో ని మంత్రి పొంగులేటిపైన ఈడీ దాడులు చే సి, భారీగా నగదుతో పాటు ఆస్తులను గుర్తించినట్టు వార్తలొచ్చి 5 నెలలు దాటినా ఇప్ప టిదాకా ఆ అంశంపై కనీసం ఒక్క ప్రకటన కూడా రాలేదన్నారు.