calender_icon.png 13 December, 2024 | 10:24 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

బెంగాల్‌లో రామ మందిర ప్రాజెక్టు ప్రకటించిన బీజేపీ

13-12-2024 04:30:33 PM

కోల్‌కతా,(విజయక్రాంతి): బీజేపీ మరో సంచలన నిర్ణయం తీసుకుంది. బెహరాంపూర్‌లో రామ మందిరాన్ని నిర్మించాలని ఆలోచిస్తున్నట్లు పశ్చిమ బెంగాల్ బీజేపీ ముర్షిదాబాద్ యూనిట్ శుక్రవారం ప్రకటించింది. టీఎంసీ ఎమ్మెల్యే హుమాయున్ కబీర్ అదే జిల్లాలోని బెల్దంగాలో బాబ్రీ మసీదు తరహాలో మసీదును ఏర్పాటు చేయాలని ప్రతిపాదించిన రోజుల తర్వాత అయోధ్యలో రామ మందిరాన్ని ప్రారంభించిన సంవత్సరం తర్వాత 2025 జనవరి 22వ తేదీన ఆలయ నిర్మాణం ప్రారంభమవుతుందని బీజేపీ తెలిపింది. బీజేపీ బెహరాంపూర్ జిల్లా అధ్యక్షుడు శఖారావ్ సర్కార్ మాట్లాడుతూ... ఇప్పటికే బెహరాంపూర్ ప్రాంతంలో స్థలాన్ని గుర్తించామని, మందిరా నిర్మాణానికి రూ.10 కోట్లు ఖర్చవుతుందని అంచనా వేసినట్లు ఆయన పేర్కొన్నారు. 

అయోధ్యలో ఆలయ రూపకల్పన ఆధారంగా రామ మందిర నిర్మాణ పనులు త్వరలో ప్రారంభమవుతాయని శఖారావ్ సర్కార్ వెల్లడించారు. బెల్దంగ నుండి టీఎంసీ ఎమ్మెల్యే కబీర్ మంగళవారం మసీదు కోసం ప్రణాళికలను ప్రకటించారని, ఈ ప్రాంతంలోని మైనారిటీ ప్రజల మనోభావాలను గౌరవిస్తుందన్నారు. కబీర్ చేసిన వ్యాఖ్యలు రాజకీయంగా వివాదానికి దారితీశాయని, రాజకీయ లబ్ధి కోసం వర్గాలను పోలరైజ్ చేసేందుకు ప్రయత్నిస్తున్నారని ప్రతిపక్షాలు ఆరోపించాయి.

మైనారిటీలు జనాభాలో 75 శాతం ఉన్న ముర్షిదాబాద్‌లో హిందూ సమాజంలో తన ఉనికిని బలోపేతం చేయడానికి రామ మందిరాన్ని నిర్మించాలనే బీజేపీ ప్రతిపాదిత వ్యూహాత్మక చర్యగా పరిగణించబడుతుందని స్పష్టం చేశారు. ఈ వివాదంపై స్పందించిన టీఎంసీ కబీర్ వ్యాఖ్యలకు దూరంగా ఉండి, వాటిని ఆయన అభిప్రాయంగా అభివర్ణించింది. కబీర్ చేసిన ఈ ప్రకటనతో టీఎంసీకి ఎలాంటి సంబంధం లేదని పార్టీ సీనియర్ నేత ఒకరు తెలిపారు. సున్నిత ప్రాంతంలో విభజన రాజకీయాలు చేస్తున్నారని ఆరోపించిన కాంగ్రెస్ నుంచి కూడా కబీర్ ప్రకటన విమర్శలు గుప్పించింది.