calender_icon.png 28 February, 2025 | 4:52 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

బీజేపీ, కాంగ్రెస్ నేతల తోపులాట

28-02-2025 01:19:53 AM

  1. మంచిర్యాలలో ఓటర్లను అభ్యర్థించడంపై ఉద్రిక్తత 
  2. భిక్కనూర్‌లో బీజేపీ, కాంగ్రెస్ టెంట్ల తొలగింపు

మంచిర్యాల/కామారెడ్డి, ఫిబ్రవరి 27 (విజయక్రాంతి): మంచిర్యాల జిల్లా నస్పూర్ మున్సిపాలిటీ తీగల్‌పహాడ్‌లో ఎమ్మెల్సీ పో లింగ్ కేంద్రం వద్ద గురువారం కాంగ్రెస్, బీ జేపీ నాయకులు, కార్యకర్తలు ఓటర్లను అభ్యర్థిస్తూ ప్రచారం చేశారు. ఈ విషయమై సీసీసీ ఎస్సై సుగుణాకర్‌కు, బీజేపీ నాయకుడు కమలాకర్‌రావు మధ్య వాగ్వాదం జరిగింది.

అయితే ఎస్సై కాంగ్రెస్‌కు మద్దతుగా ప్రచా రం చేస్తున్నారని ఆరోపించడంతోపాటు ఎ స్సై తనను తోసివేశాడంటూ బీజేపీ నాయకులతో కలిసి బైఠాయించారు. అక్కడకు చే రుకున్న కాంగ్రెస్ నాయకులు పోలీసులనే ఎదురిస్తారా అంటూ బీజేపీ నేతలను నిలదీయడంతో తోపులాట జరిగింది. కొందరు రాళ్లు రువ్వడంతో బీజేపీ కార్యకర్తతోపాటు కానిస్టేబుల్‌కు గాయాలయ్యాయి.

పోలీసు లు ఇరు వర్గాలను చెదరగొట్టి పరిస్థితిని అ దుపులోకి తెచ్చారు. మందమర్రిలోని సింగరేణి కేంద్రంలో బీజేపీ నాయకులు వేసుకు న్న కుర్చీల వద్ద కాంగ్రెస్ నాయకులు వచ్చి టెంట్ వేయడంతో ఘర్షణ వాతావరణం నెలకొంది. పోలీసులు గొడవను సద్దుమణించారు. కామారెడ్డి జిల్లా భిక్కనూర్‌లో ఓట ర్లను తమ అభ్యర్థికి వేయలంటూ బీజేపీ నేత లు అభ్యర్థించారు. కాంగ్రెస్ నాయకులు పోలీసులకు ఫిర్యాదు చేశారు.

నిబంధనలు పాటించాలంటూ బీజేపీ నాయకులను ఎస్సై ఆంజనేయులు సూచించారు. దీంతో అధికార పార్టీకి పోలీసులు వత్తాసు పలుకుతు న్నారంటూ బీజేపీ నేతలు నిలదీశారు. ఎన్నికల నియావళిని ఉల్లంఘించారని బీజేపీ వేసిన టెంట్లను పోలీసులు తొలగించారు. కాంగ్రెస్ పార్టీ టెంటును తొలగించాలని బీజేపీ నాయకులు అడిషనల్ ఎస్పీ చైతన్యరెడ్డికి ఫిర్యాదు చేయడంతో తొలగించారు. లింగంపేటలో బీజేపీ నేతలకు ఎల్లారెడ్డి డీఎస్పీ శ్రీనివాసులుకు వాగ్వాదం జరిగింది.