calender_icon.png 29 March, 2025 | 9:15 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

బిజెపి, బీఆర్ఎస్ దోపిడీ దొంగలే..

26-03-2025 06:53:14 PM

కరీంనగర్ (విజయక్రాంతి): బిజెపి, బీఆర్ఎస్ రెండు పార్టీలు దోపిడి దొంగలేనని, పది సంవత్సరాలుగా తెలంగాణ రాష్ట్రంలో అధికారంలో ఉన్నపుడు బీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర ప్రజలను మోసం చేసుకుంటూనే కాలమెల్లదీసిందని కరీంనగర్ జిల్లా యువజన కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి మొహమ్మద్ అజీమ్ తెలిపారు. కేంద్రంలో అధికారంలో ఉన్న బిజెపి కనుసన్నలలోనే తెలంగాణ రాష్ట్రంలో అధికారం కొనసాగించిన బీఆర్ఎస్ రాష్ట్ర ప్రజలను మోసం చేస్తూ రాష్ట్రాన్ని దోచుకుందని అన్నారు.

కరీంనగర్ లో బీఆర్ఎస్ నగర అధ్యక్షుడు చల్ల హరిశంకర్ మతి భ్రమించిందని పేర్కొన్నారు. రాష్ట్ర రవాణా & బిసి సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ ను విమర్శించే  స్థాయి చల్ల హరిశంకర్ లేదని, పది సంవత్సరాలు బీఆర్ఎస్ ప్రభుత్వంలో అభివృద్ధి పేరుతో అవినీతి జరిగిందని చల్ల హరి శంకర్ ఒప్పుకున్నట్టే. కాంట్రాక్టర్స్ దగ్గర కమీషన్లు తీసుకొని భవనాలు ఇంటి నిర్మాణాలు చేపట్టుకున్నారని ఒప్పుకున్నట్లే ఏఎన్నార్. స్మార్ట్ సిటీ పేరుతో అభివృద్ధి ముసుగులో కరీంనగర్ ను అవినీతి కరీంనగర్ గా మార్చిన బీఆర్ఎస్ పార్టీ మంత్రి పొన్నం ప్రభాకర్ గురించి మాట్లాడడం హాస్యస్పదంగా ఉందన్నారు.

పుట్టిన గడ్డ ఐన కరీంనగర్ కు లా కళాశాల, 70 ఎలక్ట్రికల్ బస్సులు తీసుకొచ్చిన ఘనత మంత్రి పొన్నం ప్రభాకర్ దేనని, గతంలో పాస్పోర్ట్ ఆఫీసు, తిరుపతి రైలు తీసుకురావడం మెడికల్ కాలేజ్ కోసం ఆమరణ నిరాహార దీక్ష చేసింది రాష్ట్ర మంత్రి పొన్నం ప్రభాకర్ ఘనత అన్నారు. ఈ విషయాలు చల్ల హరిశంకర్ కి కనబడటం లేదా?! పది సంవత్సరాలు  బీఆర్ఎస్ అధికారంలో ఉండి మీ నాయకుడు మాజీ మంత్రి గంగుల కమలాకర్ కరీంనగర్ కి ఏం చేశారని ప్రశ్నించారు. ఈ కార్యక్రమంలో జిల్లా యువజన కాంగ్రెస్ వైస్ ప్రెసిడెంట్ ఫహాద్, నియోజకవర్గ యూత్ కాంగ్రెస్ వైస్ ప్రెసిడెంట్ జరిపోతుల వాసు, కొత్తపెళ్లి మండల్ వైస్ ప్రెసిడెంట్ ఉల్లందుల అనిల్, అంజిత్ రెడ్డి, రాజు, తదితరులు పాల్గొన్నారు.