- సీఎం మారతారంటూ విష ప్రచారం
- తెలంగాణలో బీజేపీ పప్పులు ఉడకవు
- బీఆర్‌ఎస్, బీజేపీల మధ్య లోపాయికారి ఒప్పందం
- ప్రతిపక్షాలపై మంత్రి శ్రీధర్‌బాబు ఆగ్రహం
హైదరాబాద్, నవంబర్ 3 (విజయ క్రాం తి): ప్రజాస్వామ్య విలువలకు బీజేపీ, బీఆర్‌ఎస్ తిలోదకాలు ఇచ్చేశాయని మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు మండిపడ్డారు. జూన్‌లో సీఎం మార తారన్న బీజేపీ వ్యాఖ్యలపై ఆయన ఘాటుగా స్పందించారు. కాంగ్రెస్ అధికారంలోకి రావడాన్ని రెండు పార్టీలు జీర్ణించుకోలేక పోతున్నా యని ఆగ్రహించారు.
ప్రభుత్వం ఎప్పుడు కూలిపోతుందా అని బీఆర్‌ఎస్ ఎదురుచూస్తోందని ఆరోపించారు. తాజా వ్యాఖ్యలతో ఇప్పుడు బీజేపీ అదే బాట పట్టినట్టు స్పష్టం అయిందన్నారు. ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేయడంలో బీజేపీ నేతలు సిద్ధహస్తులని ఆరోపించారు. ప్రజాస్వామ్యంలో ఎన్నికల్లో గెలిచిన పార్టీ అధికారాన్ని చేపడితే, ఓడిన పార్టీలు బాధ్యతాయుతమైన ప్రతిపక్ష పాత్ర పోషించాలన్నారు.
ప్రతిపక్షంలో ఉన్న బీజేపీ తన విధిని మర్చిపోయి అధికారం కోసం అడ్డదారులు తొక్కుతోందని ఆరోపించారు. పలు రాష్ట్రాల్లో కుట్రపూరితంగా ప్రభుత్వాలను కూల్చి దొడ్డిదారిన అధికారాన్ని చేపట్టిందని విమర్శించారు. మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో ఓటర్లు బీజేపీకి తగిన బుద్ధి చెప్తారన్నారు.
బీజేపీయేతర రాష్ట్రాల్లో పార్టీలను ఏమార్చి బీజేపీ పబ్బం గుడుపుకుంటోందని విమర్శించారు. కానీ తెలంగాణలో అలాంటి పప్పులు ఉడకవని స్పష్టం చేశారు. కాంగ్రెస్ నేతృత్వంలోని ప్రజా ప్రభుత్వం పూర్తి కాలం పనిచేస్తుందన్నారు.
బీజేపీ, బీఆర్‌ఎస్‌లు దొందూ దొందే
రాష్ట్రంలో అధికారం కోల్పోయాక బీఆర్‌ఎస్ దిక్కుతోచని స్థితిలో కూరుకుపోయిందని మంత్రి వ్యాఖ్యానించారు. కాంగ్రెస్ అధికార పీఠం ఎక్కిన రెండో రోజు నుంచే ఆ పార్టీ నేత లు విషం చిమ్మడం ప్రారంభించారని అసహ నం వ్యక్తం చేశారు. బీఆర్‌ఎస్ నేతలది ఫక్తు అధికార దాహమేనని పేర్కొన్నారు.
ఎన్నికల్లో ఓడి పోయి అధికారం చేజారిన తర్వాత ఒక్క క్షణం కూడా ఆగలేకపోతున్నారని విమర్శించారు. కానీ వాళ్ల పాలనపై వెగటు పుట్టే ప్రజలు వారి ని గద్దె దించిన విషయాన్ని మర్చిపోవొద్దన్నా రు. ఖజానా ఖాళీ చేసి వెళ్లింది బీఆర్‌ఎస్ కాదా? రాష్ట్రాన్ని అప్పుల కుప్పలా మార్చిన పాపం గత ప్రభుత్వానిది కాదా అని ప్రశ్నించారు.
బీఆర్‌ఎస్ సృష్టించిన ఆర్థిక సంక్షోభం నుంచి రాష్ట్రాన్ని గట్టెక్కించేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం పకడ్బందీ ప్రణాళికను అనుసరిస్తోందన్నారు. 6 గ్యారెంటీలతోపాటు ప్రతి హామీని నెరవేర్చి తీరుతామని తేల్చి చెప్పారు. బీఆర్‌ఎస్, బీజేపీ దొందూ దొందే అన్నారు. కేంద్రం లో ఒక పార్టీ, రాష్ట్రంలో మరో పార్టీ ప్రజలను నమ్మించి వంచించాయని ఆరోపించారు.
రాష్ట్రంలో కాంగ్రెస్ సర్కారును కూలదోసేందు కు రెండు పార్టీలు కుమ్మక్కయ్యాయని ఆరోపించారు. అందుకే ఆయా పార్టీల నేతలు విపరీత మైన వ్యాఖ్యలు చేస్తున్నారని అభిప్రాయపడ్డా రు. ఎవరెన్ని కుట్రలు పన్నినా కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఏం చేయలేరన్నారు. ఈ నిజాన్ని రెండు పార్టీల నేతలు గ్రహించాలని సూచించారు.