11-04-2025 05:50:39 PM
న్యూఢిల్లీ,(విజయక్రాంతి): తమిళనాడు రాజకీయాల్లో కీలక పరిణామం చోటుచేసుకుంది. తమిళనాడులో అన్నాడీఎంకే(AIADMK), బీజేపీ(BJP) మధ్య పొత్తు ఖారారైంది. వచ్చే తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో(Tamil Nadu Assembly Elections) అన్నాడీఎంకేతో కలిసి పోటీచేస్తామని కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా(Union Home Minister Amit Shah) పేర్కొన్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, పళనిస్వామి నేతృత్వంలో ఎన్నికలకు వెళ్తామని, ఎన్డీయే కూటమి భారీ మెజార్టీతో వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో గెలుస్తుందని ఆయన తెలిపారు. అన్నాడీఎంకేతో కలిసి కూటమి ప్రభుత్వం ఏర్పాటు చేస్తామని, అధికారం, సీట్ల పంపకాలపై తర్వాత నిర్ణయిస్తామన్నారు. అన్నాడీఎంకే అంతర్గత వ్యవహారాల్లో జోక్యం చేసుకోం అని అమిత్ షా స్పష్టం చేశారు.