calender_icon.png 19 April, 2025 | 12:58 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

అన్నాడీఎంకేతో బీజేపీ పొత్తు

12-04-2025 01:08:52 AM

  1. కేంద్ర హోంమంత్రి అమిత్ షా ప్రకటన 
  2. తమిళనాడు బీజేపీ అధ్యక్షుడిగా నాగేంద్రన్!

చెన్నై, ఏప్రిల్ 11: తమిళ రాజకీయాల్లో కీలక పరిణామం చోటుచేసుకుంది. 2026లో తమిళనాడు అసెంబ్లీకి జరిగే ఎన్నికల్లో అన్నాడీఎంకేతో కలిసి పోటీచేసేందుకు బీజేపీ పొత్తు కుదుర్చుకుంది. కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఈ విషయం ప్రకటించారు. పళనిస్వామి సారథ్యంలో అసెంబ్లీ ఎన్నికలకు వెళ్లనున్నట్లు ఆయన స్పష్టం చేశారు. ప్రస్తుతం అమిత్ షా తమిళనాడు పర్యటనలో ఉన్నారు.

ఈ నేపథ్యంలో అన్నాడీఎంకే ప్రధాన కార్యదర్శి పళనిస్వామి, ఆ రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు కే అన్నామలైతో కలిసి అమిత్ షా చెన్నైలో శుక్రవారం మీడియా సమావేశంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా షా మాట్లాడుతూ అన్నాడీఎంకే చేరికతో ఎన్డీయే కూటమి మరింత బలోపేతమయిందని అభిప్రాయపడ్డారు.

ఈ ఎన్నికల్లో ఎన్డీయే కూటమి విజయం సాధించి తమిళనాడులో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుందని షా విశ్వాసం వ్యక్తం చేశారు. ఈ పొత్తుకోసం అన్నాడీఎంకే ఎలాంటి షరతులు, డిమాండ్లు పెట్టలేదని వెల్లడించారు. అలాగే, ఎన్నాడీఎంకే అంతర్గత వ్యవహారాల్లో తాము జోక్యం చేసుకోబోమన్నారు. సీట్ల కేటాయింపుపై తర్వాత చర్చిస్తామని అమిత్ షా వెల్లడించారు. 

తమిళ సంస్కృతిని బీజేపీ గౌరవిస్తుంది

తమిళ భాష, ప్రజలు, సంస్కృతిని బీజేపీ గౌరవిస్తుందని అమిత్ షా పేర్కొన్నారు. సీఎం ఎంకే స్టాలిన్ నేతృత్వంలోని డీఎంకే ప్రభుత్వం అవినీతికి పాల్పడటంతోపాటు తమిళుల ప్రయోజనాలను విస్మరించిందని ఆరోపించారు. తమిళ మాద్యమంలో ప్రొఫెషనల్ కోర్సులను డీఎంకే ప్రభు త్వం అనుమతించట్లేదని విమర్శించారు.

ఎన్డీయే ప్రభుత్వం ఉన్న ప్రతిచో టా మెడిసిన్, ఇంజినీరింగ్ కోర్సుల సిలబస్‌ను మాతృభాషలో అందుబాటులోకి తెచ్చినట్టు పే ర్కొన్నారు. తమిళ భాష కు స్టాలిన్ ఏం చేశారో చె ప్పగలరా అని ఈ సందర్భంగా షా ప్రశ్నించారు. సనాతన ధర్మం, త్రిభాషా విధానం, నీట్, డీలిమిటేషన్ వంటి అంశాలతో ప్రభుత్వ వైఫల్యాల నుం చి ప్రజల దృష్టిని మరల్చడానికి డీఎంకే ప్రభుత్వం ప్రయత్నిస్తుందని విమర్శించారు.

అలాగే, డీఎం కే ప్రభుత్వం లిక్కర్ పాల సీ, ఉపాధి హామీ పథకా ల్లో కుంభకోణాలకు పా ల్పడిందని ఆరోపించా రు. ఈ కుంభకోణాలపై సీఎం స్టాలిన్, ఉధయని ది సమాధానం చెప్పాలని అమిత్ షా డిమాండ్ చేశారు. 

తమిళనాడు బీజేపీ సారథిగా నాగేంద్రన్!

తమిళనాడు రాష్ట్ర బీజే పీ అధ్యక్ష పదవికి ఆ పార్టీ ఎమ్మెల్యే నైనార్ నాగేంద్రన్ నామినేషన్ దాఖలు చేశారు. తిరునల్వేలి అసెంబ్లీస్థానం నుంచి ప్రాతిని ధ్యం వహిస్తున్న ఆయన టీ నగర్‌లోని పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యాలయానికి చేరుకుని తన నామినేషన్ పత్రాలు సమర్పించారు. ఇతర బీజేపీ నేతలు ఎవ రూ రాష్ట్ర అధ్యక్ష పదవి కోసం పోటీ పడటం లేదు.

ఈ విషయాన్ని కేంద్ర హోం మంత్రి అమిత్ షా ఎక్స్ వేదికగా స్పష్టం చేశా రు. తమిళనాడు బీజేపీ రాష్ట్ర అధ్యక్ష పదవికి నామినేషన్ వేసిన ఏకైక వ్యక్తి నాగేంద్రన్ మాత్రమేనని ‘ఎక్స్’ ద్వారా షా పేర్కొన్నారు. దీంతో రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడిగా ఆయన ఎన్నిక ఏకగ్రీవం కానుంది. ఈ క్రమంలో తమిళనాడు బీజేపీకి 13వ అధ్యక్షుడిగా నాగేంద్రన్  బాధ్యతలు స్వీకరించే అవకాశం ఉంది.