calender_icon.png 16 January, 2025 | 9:47 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

స్థానిక సంస్థల ఎన్నికలలో బీజేపీ గెలుపే లక్ష్యం

16-01-2025 05:41:58 PM

మెదక్ ఎంపీ రఘునందన్ రావు...

కొండపాక (విజయక్రాంతి): సిద్దిపేట జిల్లా, గజ్వేల్ నియోజకవర్గం, పట్టణ మండలాల, బీజేపీ నూతన అధ్యక్షులను ఇటీవల రాష్ట్ర భారతీయ జనతా పార్టీ ప్రకటించిందని, ఈ సందర్భంగా బీజేపీ నూతన అధ్యక్షులు, మెదక్ పార్లమెంట్ సభ్యులు మాధవనేని రఘునందన్ రావు(MP Madhavaneni Raghunandan Rao) నివాసంలో గురువారం మర్యాదపూర్వకంగా కలిశారు. అనంతరం నూతన అధ్యక్షులను శాలువాతో సన్మానించి, మెదక్ పార్లమెంటు సభ్యులు రఘునందన్ రావు మాట్లాడుతూ... వచ్చే స్థానిక సంస్థల ఎన్నికలలో బీజేపీ గెలుపే లక్ష్యంగా పనిచేయాలని, భారతీయ జనతా పార్టీ సిద్ధాంతాలకు అనుగుణంగా ముందుకు సాగాలని అధ్యక్షులకు దిశా నిర్దేశం చేశారు. ఈ కార్యక్రమంలో గజ్వేల్ పట్టణ బీజేపీ అధ్యక్షుడు దేవులపల్లి మనోహర్ యాదవ్, గజ్వేల్ మండల బీజేపీ అధ్యక్షులు పంజాల అశోక్ గౌడ్, కుకునూరుపల్లి మండల బీజేపీ అధ్యక్షులు అనుముల సంపత్ రెడ్డి, కొండపాక మండల బీజేపీ అధ్యక్షుడు నీలం సత్యం ముదిరాజ్ తదితరులు పాల్గొన్నారు.