calender_icon.png 27 December, 2024 | 6:46 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

బీజేపీ అబద్ధాలను బీజేడీ ఎదుర్కోలేకపోయింది: నవీన్ పట్నాయక్

26-12-2024 05:08:18 PM

భువనేశ్వర్,(విజయక్రాంతి): ఒడిశాలో అబద్ధాలు ప్రచారం చేసి ప్రజలను తప్పుదోవ పట్టించి బీజేపీ అధికారంలోకి వచ్చిందని బీజూ జనతాదళ్ అధ్యక్షుడు నవీన్ పట్నాయక్(Biju Janata Dal President Naveen Patnaik) ఆరోపించారు. ఇన్ని అబద్ధాల తర్వాత కూడా, బీజేడీ బీజేపీ కంటే ఎక్కువ ఓట్లను పొందగలిగిందని ఆయన పేర్కొన్నారు. గురువారం బీజేడీ(BJD) 28వ వ్యవస్థాపక దినోత్సవంలో ఒడిశా మాజీ సీఎం మాట్లాడుతూ... బీజేపీ అబద్ధాలను బీజేడీ ఎదుర్కోలేకపోయిందని, సోషల్ మీడియాలో ప్రచారం, తప్పుడు కథనాలు, తప్పుడు వాగ్దానాలు చేసి బీజేపీ అధికారంలోకి వచ్చిందన్నారు.

రాష్ట్రంలో బీజేపీ(BJP) ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన మొదటి ఆరు నెలల తర్వాత నిత్యావసర వస్తువుల ధరలు విపరీతంగా పెరిగిపోవడంతో ప్రజలు ఇబ్బంది పడుతున్నారన్నారు. కేంద్రం దౌర్జన్యాలకు వ్యతిరేకంగా బీజేడీ పోరాటం కొనసాగిస్తుందని, బలమైన ప్రాంతీయ పార్టీగా ఒడిశా ప్రయోజనాలను కాపాడుతుందని చెప్పారు. తమ పార్టీ బ్యాలెట్ పేపర్ల ద్వారా ఎన్నికలకు మద్దతు ఇస్తుందని, విధివిధానాలను పరిశీలిస్తున్నందున 'వన్ నేషన్ వన్ ఎలక్షన్'(One Nation One Election)పై ఇంకా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని నవీన్ పట్నాయక్  స్పష్టం చేశారు.