calender_icon.png 18 January, 2025 | 5:43 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

చెరువు కట్టను కబ్జా చేస్తున్నారని బిట్టుపల్లి రైతుల ఆందోళన

13-07-2024 11:20:12 AM

బిట్టుపల్లి పెద్ద చెరువుకు వెళ్లే రహదారిని కబ్జా చేశారని రైతుల ఆగ్రహం

మంథని,(విజయక్రాంతి): ఏకంగా చెరువు కట్టను కబ్జా చేస్తున్నారని పెద్దపల్లి జిల్లా మంథని మండలంలోని బిట్టుపల్లి గ్రామంలో రైతుల శనివారం ఉదయం ఆందోళన చేశారు. దర్మారం గ్రామానికి చెందిన ముత్తనవేన స్వామి, బిట్టుపల్లికి చెందిన సుబాక కిష్టయ్య జెసిబి తో కలిసిగ్రామంలోని చేరువు కట్టను కబ్జా చేసేందుకు ప్రయత్నం చేయగా గ్రామంలోని రైతులకు అక్కడికి చేరుకుని ఆందోళన చేశారు. పెద్ద చెరువు కింద సుమారుగా 500 ఎకరాల ఆయకట్టు ఉందని కట్టలేకుంటే చేరువు ఎలా అగుద్దని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. సంఘటన స్థలానికి మంథని ఎస్ఐ వెంకటకృష్ణ తన సిబ్బంది తో చేరుకొని రైతులతో మాట్లాడుతున్నారు. జిల్లా కలెక్టర్ గ్రామానికి రావాలని గ్రామస్తులు కోరారు.