calender_icon.png 21 January, 2025 | 7:28 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డికి చేదు అనుభవం

21-01-2025 02:38:00 PM

అభివృద్ధి కార్యక్రమాలలో ఎమ్మెల్యేను అడ్డుకున్న సొంత పార్టీ నాయకులు

ఎమ్మెల్యే డౌన్ డౌన్... ఎమ్మెల్యే గో బ్యాక్ అంటూ నినాదాలు

పటాన్ చెరు,(విజయక్రాంతి): పటాన్ చెరు కాంగ్రెస్ ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డికి చేదు అనుభవం ఎదురైంది. జిన్నారం మండలం బొల్లారం మున్సిపాలిటీ పరిధిలో మంగళవారం పలు అభివృద్ధి కార్యక్రమాల ప్రారంభోత్సవానికి హాజరైన ఎమ్మెల్యేను సొంత పార్టీ నాయకులే అడ్డుకున్నారు. జిల్లా  మంత్రి దామోదర రాజనర్సింహ ప్రారంభించాల్సిన రోడ్డు పనులను మీరు ఎలా ప్రారంభిస్తారు అంటూ ప్రశ్నించారు. అభివృద్ధి పనుల శిలాఫలకంలో ఉన్న పేర్లపై  కూడా కాంగ్రెస్ నేతలు విమర్శించారు. దీంతో బీఆర్ఎస్ కొంత మంది కాంగ్రెస్ నాయకుల మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. దీంతో కాంగ్రెస్ నాయకులు ఎమ్మెల్యే డౌన్ డౌన్... ఎమ్మెల్యే గో బ్యాక్  అంటూ పెద్ద ఎత్తున నినాదాలు చేశారు.

ఈ నినాదాలతో ఆగ్రహానికి లోనైనా బీఆర్ఎస్ నాయకులు కాంగ్రెస్ నేతలతో వాగ్వాదానికి దిగడంతో కొంత ఘర్షణ వాతావరణం నెలకొంది. పార్టీలో దశాబ్ద కాలంగా ఉంటూ పనిచేస్తున్న తమను కాదని ప్రారంభోత్సవ కార్యక్రమాలలో బీఆర్ఎస్ నాయకులకు ప్రాధాన్యత ఇవ్వడంపై కాంగ్రెస్ నాయకులు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. కాంగ్రెస్ ఎమ్మెల్యేగా  ఉండి కాంగ్రెస్ నేతల కంటే ఎక్కువగా బీఆర్ఎస్ నేతలతోనే సత్సబంధాలు కొనసాగిస్తూ తమను విస్మరిస్తున్నారు అని ఎమ్మెల్యే తీరును వారు తప్పుబట్టారు. తాము అభివృద్ధి కార్యక్రమాలకు వ్యతిరేకం కాదని ఎమ్మెల్యే తీరును మాత్రమే ప్రశ్నిస్తున్నామని కాంగ్రెస్ నేతలు తెలిపారు. కాగా అభివృద్ధి కార్యక్రమాలలో కాంగ్రెస్ నేతల తీరుపై ఎమ్మెల్యే తీవ్ర ఆగ్రహానికి గురయ్యారు.