ట్యాగింగ్‌లేని మిల్లులకు ధాన్యం!
- ఇప్పటికీ బ్యాంకు గ్యారంటీ ఇవ్వని మిల్లర్లు
- అధికారి మనోడైతే అన్నీ ఓకే?
- మంచిర్యాలలో అధికారుల ఇష్టారాజ్యం
మంచిర్యాల, డిసెంబర్ 25 (విజయక్రాంతి): మంచిర్యాల జిల్లాలో మిల్లులకు ధాన్యం కేటాయించడంలో ఇష్టారాజ్యం కొనసాగుతోంది. అధికారులు మాముళ్లు తీసుకుని డీఫాల్టర్లు, ఏండ్లకు ఏండ్లుగా ధాన్యం ఇవ్వని మిల్లులకు సీఎంఆర్ కోసం ధాన్యం కేటాయిస్తున్నారు.
ట్యాగింగ్ లేని మిల్లులు..
మంచిర్యాల జిల్లాలో ఈ సీజన్‌లో వర్ణమోడ్రన్ రైస్ మిల్, జయలక్షిమ, శ్రీ రాజరాజేశ్వర జైపూర్, సమత ఆగ్రో, శ్రీరామచంద్ర, శ్రీరామ, లక్ష్మీ రైస్‌మిల్, చాముం డేశ్వరి, రాధాకృష్ణ, రత్నగర్భ, గాయత్రి, వెంకటేశ్వర, శ్రీ సత్యనారాయణ స్వామి, శార్వాణీ, వెంకటేశ్వర, భవాని, లక్ష్మీ గణపతి, ఎస్‌ఆర్‌ఎం, రాజరాజేశ్వర ట్రేడర్స్, ధనలక్ష్మి, శివసాయి రాఘవేంద్ర, రాజరాజేశ్వర మొ ర్రిగూడ మిల్లులకు సంబంధిత శాఖ అధికారులు సీఎంఆర్ ధాన్యం కోసం కేటాయించారు.
వీటితో పాటు జైపూర్ మండలం ఇందారంలోని మంజునాథ రైస్‌మిల్, అష్టలక్ష్మి రైస్ మిల్లులకు సైతం ధాన్యం వెళ్తోంది. మరోవైపు ప్యాడీ ప్రొక్యూర్‌మెంట్ కేంద్రాల వారికి ఈ రెండు మిల్లులకు కూడా ధాన్యం పంపించవచ్చు అని అనధికారికంగా కొందరు అధికారులు చెప్పడంతో మిల్లుల వద్దకు పదుల సంఖ్యలో లారీలు వచ్చి చేరాయి. కానీ ధాన్యం కొనుగోలు కేంద్రాల ట్యాబ్ అప్లికేషన్(ఓపీఎంఎస్)లో మాత్రం కనిపించడం లేదు.
అధికారుల సహకారం
సంబంధిత శాఖ అధికారులకు అర్హత లేని మిల్లరు రూ.లక్ష ఇస్తే అడిగే నాథుడే ఉండరని, డబ్బు కొట్టు.. సీఎంఆర్ ధా న్యం పట్టు స్కీం కింద ధాన్యం దింపుతున్నారని కొందరు మిల్లర్లు బాహాటంగానే మాట్లాడుతున్నారు. ధాన్యం కేటాయింపుల్లో అధికారులు ఆమ్యామ్యాలకు లొంగి పని చేస్తున్నారని దుయ్యబడుతున్నారు.
ట్యాగింగ్ ఉన్న మిల్లులకే పంపించాలని ఆదేశాలు ఇస్తున్న అధికారులు అనధికారికంగా కొన్ని మిల్లుల పేర్లు పెట్టి ధాన్యం పంపించాలని ట్రాన్స్‌ఫోర్టు కాంట్రాక్టర్లకు, కొనుగోలు ఏజెన్సీలకు సమాచారం ఇవ్వడం పలు అనుమా నాలకు తావిస్తోంది.
బ్యాంకు గ్యారంటీ ఇవ్వని మిల్లర్లు
ఏటా సీజన్ ప్రారంభంలోనే మిల్లర్లు అం డర్ టేకింగ్ ఇచ్చి బ్యాంకు గ్యారంటీ ఇవ్వాల్సి ఉంటుంది. కానీ ఈ ఏడాది వానాకాలం సీజన్ ధాన్యం కొనుగోళ్లు ముగింపునకు వస్తున్నా మిల్లర్లు బ్యాంకు గ్యారంటీలు ఇవ్వ డం లేదు. రూ.500 ఖర్చయ్యే అండర్ టేకిం గ్ అధికారుల ముందు పెట్టి రూ.వందల కోట్లు విలువ చేసే ధాన్యాన్ని ఎలాంటి బ్యాం కు గ్యారంటీ లేకుండా దింపుకుంటున్నారు. మిల్లర్లు బ్యాంకు గ్యారంటీ ఇవ్వకున్నా అధికారుల స్వలాభం కోసం ధాన్యం దింపడం గమనార్హం.