calender_icon.png 23 December, 2024 | 9:30 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

త్వరలో భారత్‌కు బిష్ణోయ్ తమ్ముడు

03-11-2024 12:29:37 AM

అన్మోల్‌ను యూఎస్ నుంచి తెచ్చేందుకు పోలీసుల ప్రయత్నాలు

ముంబై, నవంబర్ 2: ఇటీవల సంచలనం సృష్టించిన ఎన్సీపీ నేత బాబా సిద్ధిఖీ హత్య కేసులో నిందితుడిగా భావిస్తున్న గ్యాంగ్‌స్టఱ లారెన్స్ బిష్ణోయ్  సోదరుడు అన్మోల్ బిష్ణోయ్‌ను అమెరికా నుంచి భారత్‌కు రప్పించేందుకు ప్రయత్నాలు ముమ్మురం అయ్యాయి. తమ దేశంలో అక్రమంగా ఉంటున్న అన్మోల కదలికలపై అమెరికా పోలీసులు నిఘా వేశారు. అతని కదలకల గురించి పూర్తి సమాచారం అందడంతో ఆ విషయాన్ని భారత్‌కు యూఎస్ పోలీసులు చేరవేశారు.

దీంతో అన్మోల్‌ను ఇండియాకు తీసుకురావడానికి ముంబై క్రైం బాంచ్  తన ప్రయత్నాలు మొదలుపట్టినట్లు వార్తలు వస్తున్నాయి. సిద్ధిఖీ హత్య కేసు నిందితులతో అన్మోల్ ఎప్పటికప్పుడు టచ్‌లో ఉండి సూచనలు అందించినట్లు పోలీసులు తెలిపిన సంగతి తెలిసిందే. అలాగే గత ఏప్రిల్ 14న బాలీవుడ్ హీరో సల్మాన్ ఖాన్ ఇంటి వద్ద కాల్పులు జరిపిన ఘటనలో అన్మోల్‌పై ఇప్పటికే కేసు నమోదైంది. ఈ కేసు విచారణలో ముంబై పోలీసులు అతడిపై లుక్ అవుట నోటీసులు జారీ చేశారు.

ఇలా పలు ఆరోపణలు రావడంతో అన్మోల్‌ను ఇండియాకు తీసుకురావడానికి అనుమతి కోరుతూ ప్రత్యేక న్యాయస్థానంలో ముంబై పోలీసులు పిటిషన్ వేశారు. గ్యాంగ్‌స్టర్ లారెన్స్ తరపున ఇండియాలో సెటిల్‌మెంట్స్ చేస్తూ క్రిమినల్ చర్యలకు పాల్పడుతున్నట్లు ఆ పిటిషన్‌లో పేర్కొన్నారు. ఈ నేపథ్యంలోనే అతడి కదలికల గురించి యూఎస్ విశ్వసనీయ సమాచారం అందించడంతో అతడిని ఇండియాకు రప్పించేందుకు పోలీసులు తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నారు.

భారత్‌లో అన్మోల్‌పై దాదాపు 18 కేసులు నమోదయ్యాయి. భాను పేరుతో నకిలీ పాస్‌పోర్టులను పొంది భారత్‌ను విడిచి అమెరికాకు పారిపోయాడు. వివిధ మారుపేర్లతో యూఎస్‌లో తలదాచుకుంటూ భారత్‌లో నేర సామ్రాజ్యాన్ని నడుపుతున్నాడు.