calender_icon.png 27 December, 2024 | 12:06 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

వ్యాపారవేత్త ఇంటిపై బిష్ణోయ్ ప్రత్యర్థుల కాల్పులు

04-11-2024 01:36:00 AM

ఆదిపత్యం కోసం రెండు గ్యాంగ్‌ల మధ్య పోరు

న్యూఢిల్లీ, నవంబర్ 3: ఢిల్లీలోని రాణిబాగ్‌లో వ్యాపారవేత్త ఇంటిపై అక్టోబర్ 26న కాల్పులకు పాల్పడ్డ ఘటనకు సంబంధించిన సీసీ కెమెరా దృశ్యాలు బయటకు వచ్చాయి. అందులోని దృశ్యాల ప్రకారం బైక్‌పై ఇద్దరు యువకులు వచ్చి, బాంబిహా గ్యాంగ్ పేరుతోపాటు ఇంటర్నేషనల్ ఫోన్ నెంబర్ ఉన్న ఓ కాగితాన్ని ఇంటివైపు విసిరేశారు.

అనంతరం ఇంటిపై కాల్పులు జరుపుతూ అందుకు సంబంధించిన దృశ్యాలను సెల్‌ఫోన్‌లో రికార్డు చేశారు. అయితే ఈ వీడియోను అమెరికాకు చెందిన గ్యాంగ్‌స్టర్ పవన్ షోకీన్‌కు పంపినట్లు పోలీసులు చెబుతున్నారు. ప్రస్తుతం గురుగ్రామ్ జైల్లో ఉన్న కౌశల్ చౌదరి సూచన మేరకే ఉత్తరప్రదేశ్‌కు చెందిన ఇద్దరు యువకులు బిజినెస్‌మెన్ ఇంటిపై కాల్పులకు తెగబడ్డట్లు చెప్పారు.

బాంబిహా గ్యాంగ్, లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్ మధ్య ఆదిపత్య పోరు తీవ్రమవుతోందని పోలీసులు పేర్కొన్నారు. తమ గ్యాంగ్‌ను బలంగా మార్చుకోవడానికే బాంబిహా గ్యాంగ్ బెదిరింపులకు పాల్పడుతూ డబ్బులు డిమాండ్ చేస్తున్నట్టు వివరించారు.