హీరో యష్.. గీతూ మోహన్ దాస్ దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రం ‘టాక్సిక్’. కేవీఎన్ ప్రొడక్షన్స్, మాన్‌స్టర్ మైండ్ క్రియేషన్స్ పతాకాలపై వెంకట్ కే నారాయణ, యష్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. బుధవారం యష్ పుట్టినరోజు సందర్భంగా ఆయన నటిస్తున్న పాన్ ఇండియా మూవీ ‘టాక్సిక్: ఏ ఫెయిరీటేల్ ఫర్ గ్రోనప్స్’ నుంచి ‘బర్త్ డే పీక్’ అంటూ గ్లింప్స్ రూపంలో ట్రీట్‌ను విడుదల చేశారు.

ఈ వీడియోలో యష్ స్టులిష్ లుక్‌తో కనిపిస్తున్నాడు. ఆయన క్లబ్‌లోకి ఎంట్రీ ఇస్తున్న తీరు వావ్ అనిపిస్తోంది. మరో డిఫరెంట్ అవతార్‌లో యష్ మెప్పించటం ఖాయంగా అనిపిస్తోంది. టాక్సిక్ సినిమా గురించి, యష్ గురించి డైరెక్టర్ గీతూ మోహన్ దాస్ మాట్లాడుతూ “టాక్సిక్’ రొటీన్‌కు భిన్నంగా తెరకెక్కించిన సినిమా. గ్లింప్స్ చూస్తుంటేనే మనలో తెలియని ఓ డిఫరెంట్ ఫీలింగ్ కలుగుతుంది.
సినిమా ప్రపంచంలో డిఫరెంట్ స్టుల్ కలిగిన వ్యక్తి యష్. అతన్ని దగ్గరగా గమనించే వారికి.. లేదా అతనితో కలిసి ప్రయాణించే వారికి తనెంత ముందు చూపుతో ఆలోచిస్తున్నాడనే విషయం తెలుస్తుంది. ఇది కేవలం వెండితెరపై చూసి ఎంజాయ్ చేసే సినిమా మాత్రమే కాదు, ఓ వైవిధ్యమైన అనుభవాన్ని పొందుతారు” పేర్కొన్నారు డైరెక్టర్ గీతూ.