అమెరికాలో గన్ మిస్‌ఫైరై హైదరాబాదీ మృతి
వాషింగ్టన్ డీసీ, నవంబర్ 22: విదేశాలలో ఉన్నత చదువులు చది వి భవిష్యత్‌లో తమను బాగా చూసుకుంటాడనుకున్న ఆ కన్నవారి కల చెదిరింది. పుట్టిన రోజు వేడుకలో తన సొంత తుపాకీ మిస్‌ఫైర్ కావడంతో ఆ యువకుడు మృతిచెందాడు.
హైదరాబాద్ ఉప్పల్ ధర్మపు రి కాలనీకి చెందిన పాల్వాయి ఆర్యన్ రెడ్డి అమెరికాలోని జార్జియా అట్లాంటాలో ఉన్న కెన్నెసా స్టేట్ యూనివర్సిటీలో ఎంఎస్ చదువుతున్నాడు. కాగా ఈనెల 13న అమెరి కాలో స్నేహితులతో కలిసి తన బర్తడే వేడుకలను నిర్వహించుకున్నా డు ఆర్యన్.
అయితే అదేరోజు ఆర్యన్ ఉండే గది నుంచి తుపాకీ శబ్దం రావడంతో స్నేహితులు వెళ్లి చూసేసరికి ఆర్యన్ రక్తపు మడుగులో చనిపోయి కనిపించాడు. తుపాకీని శుభ్రం చేసే సమయంలో మిస్‌ఫైర్ అయి తూటా ఆర్యన్ ఛాతీలోనుంచి దూసుకెళ్లిఉంటుందని స్నేహితులు తెలిపారు. నగరంలోని ఉప్పల్‌లో ఉండే అతడి తండ్రి సుదర్శన్‌రెడ్డి, తల్లి గీతకు విషయం తెలవడంతో గుండలవిసేలా రోదించారు.
బలవంతంగా పంపించాం..
ఆర్మీ అంటే తన కొడుకుకు చాలా ఇష్టమని.. మేమే వద్దని బతిమిలాలి బలవంతంగా అమెరికాకు పంపిచామని ఆర్యన్ తండ్రి సుదర్శన్ కంటతడి పెట్టుకున్నారు. అమె రికాలో ఉన్న గన్ కల్చరే తమ కుమారుడి చావుకు కారణమైందని వారు ఆవేదన వ్యక్తం చేశారు.
అక్క డ విద్యార్థులకు కూడా గన్ లైసెన్స్ ఇస్తారన్న విషయం తెలిసిందే. ఆర్యన్ రెడ్డి ఈ యేడాది ఆగుస్టులోనే హంటింగ్ గన్‌కు లైసెన్స్ తీసుకున్నారు. ఆ గన్ యే అతడి ప్రాణాలను తీసింది. శనివారం ఉదయం లోపు ఆర్యన్‌రెడ్డి మృతదేహం హైదరాబాద్‌కు తరలించేం దుకు అధికారులు ఏర్పాట్లు చేశారు.