24-02-2025 09:21:27 PM
మంథని (విజయక్రాంతి): రాష్ట్ర ఐటీ శాఖమంత్రి దుద్దిల్ల శ్రీధర్ బాబు సోదరుడు యువ నాయకుడు శ్రీపద ట్రస్ట్ చైర్మన్ దుద్దిళ్ల శ్రీనుబాబు జన్మదిన వేడుకలను సోమవారం మంథని నియోజకవర్గంలో ఘనంగా కాంగ్రెస్ నాయకులు ప్రజలు నిర్వహించారు. గ్రామ గ్రామాన శీను బాబు అభిమానులు కాంగ్రెస్ నాయకులు కార్యకర్తలు కేక్ కట్ చేసి జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. నియోజకవర్గంలోని మంథని, ముత్తారం, రామగిరి, కమాన్పూర్, భూపాలపల్లి జిల్లా కాటారం మల్హర్ మాదాపూర్ పలిమెల మహా ముత్తారం మండలాల్లోని గ్రామాలలో పట్టణాలలో దేవాలయాల్లో ప్రభుత్వ పాఠశాలలో శ్రీను బాబు జన్మదిన వేడుకలను నిర్వహించి, పేద విద్యార్థులకు పరీక్ష సామాగ్రిని నాయకులు పంపిణీ చేశారు.
శ్రీను బాబు ఎలాంటి పదవులు లేకున్నా సాదాసీదాగా ఉంటూ పేద ప్రజలకు నిత్యం అందుబాటులో ఉంటున్నారని, ఎవరికి చిన్న ఆపద వచ్చిన నేనున్నా అంటూ ధైర్యం చెప్పి పనులు చేస్తున్నాడని నాయకులు కొనియాడారు. ఆయన ఆయురారోగ్యాలతో నిండు నూరేళ్లు జీవించి పేద ప్రజలకు ఇలాగే సేవలు చేస్తున్నారని కోరారు. ఈ వేడుకల్లో మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు యూత్ అధ్యక్షులు, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు కార్యకర్తలు యువకులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.