calender_icon.png 22 February, 2025 | 11:52 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

కేసీఆర్‌ అంటే కేవలం పేరు మాత్రమే కాదు..

17-02-2025 06:25:38 PM

తెలంగాణ ప్రజల గుండె చప్పుడు..

కొత్తగూడెం తాజా మాజీ మున్సిపల్‌ చైర్‌పర్సన్‌ కాపు సీతాలక్ష్మి..

ఘనంగా తెలంగాణ తొలి సీఎం కేసీఆర్‌ 71వ పుట్టిన రోజు వేడుకలు.. 

కొత్తగూడెం (విజయక్రాంతి): కేసీఆర్‌ అంటే కేవలం పేరు మాత్రమే కాదని, తెలంగాణ ప్రజల గుండె చప్పుడని, కేసిఆర్‌ అంటే తెలంగాణ భావోద్వేగం, అభిరుచి, ప్రజా ఉద్యమం, ఆత్మగౌరవ పోరాటం అని, ప్రజల గుండెల్లో స్థిరస్థాయిగా కేసీఆర్‌ చేసిన అభివృద్ధి నిలిచిపోతుందని, నాలుగు కోట్ల ప్రజల ఆకాంక్షను, 62ఏళ్ల కలను సాకారం చేసిన ధీరుడు కేసీఆర్‌ అని,సాగునీరు, తాగ నీరు కష్టాలను తొలగించిన అపరభగీరధుడు కేసీఆర్‌ అని కొత్తగూడెం తాజా మాజీ మున్సిపల్‌ చైర్‌పర్సన్‌ కాపు సీతాలక్ష్మి అన్నారు. తెలంగాణ రాష్ట్ర తొలి ముఖ్యమంత్రి కేసీఆర్‌ పుట్టిన రోజు సందర్భంగా కాపు సీతాలక్ష్మి ఆధ్వర్యంలో కొత్తగూడెంలో ఘనంగా నిర్వహించారు.

ముందుగా బిఆర్‌ఎస్‌ పార్టీ కార్యాలయంలో బిఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ ఇచ్చిన పిలుపులో భాగంగా బిఆర్‌ఎస్‌ పార్టీ అధ్యక్షులు రేగా కాంతారావు, మాజీ మంత్రి వనమా వెంకటేశ్వరరావు సూచనల మేరకు ప్రతి ఒక్క కార్యకర్త మూడు మొక్కలు నాటారు. వీటితో పాటు బిఆర్ఎస్ జిల్లా అధ్యక్షులు రేగా కాంతారావు పార్టీ కార్యాలయంలో 71మొక్కలు నటించడం పట్ల సంతోషం వ్యక్తం చేశారు. అనంతరం కేక్ కట్ చేయడం, రోగులకుపాటు పండ్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా కాపు సీతాలక్ష్మి మాట్లాడుతూ..  తెలంగాణ అభివృద్ధి ప్రదాత తెలంగాణ సాధకుడు ఉద్యమ నేత, తెలంగాణ తొలి సీఎం కేసీఆర్‌ ఆయురారోగ్యాలతో, సుఖ సంతోషాలతో ఉండాలని ఆకాంక్షించారు. 

తెలంగాణ అభివృద్ధి పథంలో నడిపిన కేసీఆర్ నాలుగు కోట్ల ప్రజల ఆకాంక్షను, 62ఏళ్ల కలను సాకారం చేయడమే కాకుండా తన ప్రాణాల్ని పణంగా పెట్టి ప్రత్యేక రాష్ట్రాన్ని సాధించి తెలంగాణ జాతిపితగా అభివర్ణించారు. ఈ కార్యక్రమంలో మాజీ మున్సిపల్‌ కోఆప్షన్‌ సభ్యులు దూడల బుచ్చయ్య, లచ్చిరామ్‌, శివ, మాజీ మున్సిపల్‌ కౌన్సిలర్‌ ప్రసాద్‌, ఆత్మ కమిటీ మాజీ చైర్మన్‌ బత్తుల వీరయ్య, ఉర్దూ ఘర్‌ మాజీ చైర్మన్‌ అన్వర్‌ పాషా, జయరామ్‌, కుమారుడు చౌహాన్‌, తొగరు రాజశేఖర్‌, హుస్సేన్‌, ఖాజా, సురిబాబు, జయరాజు, నరసయ్య, టైలరన శ్రీను, వందలాది మంది మహిళా కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.