10-02-2025 04:45:56 PM
మందమర్రి (విజయక్రాంతి): పెద్దపల్లి పార్లమెంటు సభ్యులు గడ్డం వంశీ కృష్ణ జన్మదిన వేడుకులు పట్టణంలో ఘనంగా నిర్వహించారు. కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో పట్టణంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో సోమవారం జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ పట్టణ అధ్యక్షులు నోముల ఉపేందర్ గౌడ్, సీనియర్ నాయకులు సొత్కు సుదర్శన్, పుల్లూరి లక్ష్మణ్, పైడిమల్ల నర్సింగ్ లు మాట్లాడుతూ... చెన్నూరు ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి వారసుడిగా రాజకీయాల్లోకి అడుగుపెట్టి వారి ఆశయాలను కొనసాగిస్తూ, పెద్దపల్లి పార్లమెంటు, చెన్నూరు నియోజకవర్గంలో దాదాపు 100 కోట్ల అభివృద్ధి చేపట్టిన గడ్డం వంశీకృష్ణని చెన్నూరు ప్రజలు మరిచిపోరని అన్నారు.
ఈ కార్యక్రమంలో సింగిల్ విండో చైర్మన్ ఎస్ ప్రభాకర్ రావు, ఎస్సీ సెల్ పట్టణ అధ్యక్షులు నెరువట్ల శ్రీనివాస్, మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు గడ్డం రజిని, పట్టణ ఉపాధ్యక్షులు కనకం రాజు, మైనార్టీ పట్టణ అధ్యక్షులు ఎండి జమీల్, మంకు రమేష్, ఎండి సుకుర్, మహంతు అర్జున్, ఎర్ర రాజు, మంద తిరుమల్, వడ్లూరి సునీల్ కుమార్, బుర్ర ఆంజనేయులు గౌడ్, ఉదయ్ అంకం రాజకుమార్, నామిని ముత్తయ్య, బండి శంకర్ గౌడ్, రెడ్డి ఐలయ్య, సురేందర్, రాయబారం కిరణ్, శ్రీనివాస్, ముడారం శేఖర్, తుంగ పిండి విజయ్, వీరన్న, లక్ష్మణ్, ఎండి ఇసాక్, ఎండి జావిద్ ఖాన్, మహిళా నాయకురాలు పోచంపల్లి లక్ష్మి, కవిత, గోలేటి లక్ష్మి, యూత్ కాంగ్రెస్, మహిళా కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు.