calender_icon.png 11 January, 2025 | 9:18 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఘనంగా ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డి జన్మదిన వేడుకలు

03-01-2025 09:02:59 PM

ఎమ్మెల్యే జన్మదినాన్ని పురస్కరించుకొని క్యాంపు కార్యాలయంలో రక్తదాన శిబిరం...

మహబూబ్ నగర్ (విజయక్రాంతి): అసెంబ్లీ నియోజకవర్గాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేయడానికి ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డి ఎంతో కృషి చేస్తున్నారని పలువురు చైర్మన్లు అన్నారు. ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డి జన్మదినాన్ని పురస్కరించుకొని స్థానిక ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో కాంగ్రెస్ పార్టీ శ్రేణులు, నాయకులు ఏర్పాటు చేసిన రక్తదాన శిబిరాన్ని ముడా చైర్మన్ లక్ష్మణ్ యాదవ్ తో కలిసి మున్సిపల్ చైర్మన్ ఆనంద్ గౌడ్ ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. మహబూబ్ నగర్ లో ప్రధానంగా విద్య, వైద్య, ఉపాధితో పాటు వ్యవసాయం అభివృద్ధిపైన ఎమ్మెల్యే అత్యంత శ్రద్ధ చూయిస్తున్నారని అన్నారు.

నియోజకవర్గంలోని ప్రతి పేద విద్యార్థి చదువు మధ్యలో ఆగిపోకుండా ఉండే విధంగా మహబూబ్ నగర్ విద్యానిధిని ఎమ్మెల్యే ఈ నూతన సంవత్సరం సందర్భంగా ప్రారంభించడం సంతోషంగా ఉందన్నారు. ఈ విద్యానిధికి తమవంతు సహాయం అందజేయాలని నియోజకవర్గ ప్రజలకు విజ్ఞప్తి చేశారు. ఈ విద్యానిధి పేద విద్యార్థుల చదువుకు, పాఠశాలల అభివృద్ధికి ఉపయోగపడుతుందని తెలిపారు. మహబూబ్ నగర్ నియోజకవర్గ ప్రజల తరఫున ఎమ్మెల్యేకు ప్రత్యేక పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో మార్కెట్ కమిటీ చైర్మన్ బెక్కరి అనిత, మున్సిపల్ వైస్ చైర్మన్ షబ్బీర్, డీసీసీ మీడియా సెల్ కన్వీనర్ సిజే బెనహర్, జిల్లా కాంగ్రెస్ పార్టీ మహిళా అధ్యక్షురాలు వసంత, డిసిసి ప్రధాన కార్యదర్శి సిరాజ్ ఖాద్రీ, క్రిస్టియన్ మైనారిటీ పట్టణ అధ్యక్షులు శ్యాముల్, నాయకులు నవనీత, సహజ, ప్రవీణ్ కుమార్ తో పాటు రెడ్ క్రాస్ సంస్థ చైర్మన్ లయన్ నటరాజ్, బ్లడ్ బ్యాంక్ ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.

జిల్లా కాంగ్రెస్ కార్యాలయంలో ఎమ్మెల్యే జన్మదిన వేడుకలు

జిల్లా కేంద్రంలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డి జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా చైర్మన్లు, నాయకులు కేక్ కట్ చేసి సంబరాలు చేశారు. ఈ కార్యక్రమంలో టిపిసిసి ప్రధాన కార్యదర్శి వినోద్ కుమార్, మున్సిపల్ చైర్మన్ ఆనంద్ గౌడ్, మూడా చైర్మన్ లక్ష్మణ్ యాదవ్, మార్కెట్ చైర్మన్ బెక్కరి అనిత, వైస్ చైర్మన్ విజయ్ కుమార్, మీడియా సెల్ కన్వీనర్ సీజే బెనహర్, నాయకులు తదితరులు పాల్గొన్నారు.