శ్రీరంగాపురం: మండల కేంద్రంలో అంబేద్కర్ కాలనీలోని వనపర్తి ఎమ్మెల్యే తూడి మేఘారెడ్డి జన్మదిన వేడుకలను బుధవారం నిర్వహించి చిన్నారుల సమక్షంలో కేక్ కట్ చేయడం జరిగింది. ఈ సందర్భంగా ఎస్సీసెల్ ప్రధాన కార్యదర్శి ఆశన్న మాట్లాడుతూ... వనపర్తి ఎమ్మెల్యే మేఘారెడ్డికి జన్మదిన శుభాకాంక్షలు తెలుపుతూ హర్షం వ్యక్తం చేస్తున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో శ్రీనివాసులు, రవికుమార్, రాముడు, నాగరాజు, రామస్వామి, శ్రీకాంత్, అంబేద్కర్ కాలనీ మహిళలు చెన్నమ్మ, సంధ్య, భాగ్యలక్ష్మి, సునీత, అలివేల తదితరులు పాల్గొన్నారు.