05-04-2025 10:48:32 PM
పెన్ పహాడ్: మాజీమంత్రి, రాంరెడ్డి దామోదర్ రెడ్డి తనయుడు, ఏఐసీసీ సభ్యులు రాంరెడ్డి సర్వోత్తమ్ రెడ్డి జన్మదిన వేడుకలు శనివారం రాత్రి సూర్యాపేట జిల్లా పెన్ పహాడ్ మండలంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్బంగా కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు తూముల సురేష్ రావు ఆధ్వర్యంలో కేక్ కట్ చేసి స్వీట్లు పంపిణి చేశారు. వారి వెంట కాంగ్రెస్ కార్యకర్తలు శివ, సందీప్ రాథోడ్, రవి, వెంకన్న తదితరులు ఉన్నారు.