calender_icon.png 19 April, 2025 | 4:37 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

మానసిక దివ్యాంగ చిన్నారులతో జన్మదిన వేడుక

11-04-2025 12:00:00 AM

హనుమకొండ, ఏప్రిల్ 10 (విజయక్రాంతి):  వరంగల్ ఎంపీ డాక్టర్ కడియం కావ్య తన పుట్టినరోజు వేడుకలను మానసిక దివ్యాంగ చిన్నారులతో కలిసి జరుపుకున్నారు. కనకదుర్గ కాలనీలోని ఎంపీ క్యాంపు కార్యాలయంలో మల్లికాంబ మనోవికాస కేంద్రానికి చెందిన మానసిక దివ్యాంగ చిన్నారులు ఎంపీకి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు.

ఈ సందర్భంగా  చిన్నారులను ఆప్యాయంగా పలకరించి, దివ్యాంగ చిన్నారులతో కొంత సమయం గడిపి వారి యోగక్షేమాలను, వారు ఏం చదువుతున్నారు, ఎందులో ప్రతిభ కలిగి ఉన్నారో అడిగి తెలుసుకొని, చిన్నారులకు స్వయంగా స్వీట్లు తినిపించి, ప్రతి ఏడాది తన పుట్టినరోజు వేడుకలను మానసిక దివ్యాంగ చిన్నారులతో కలిసి జరుపుకోవడం ఎంతో సంతోషంగా ఉంటుందని తెలిపారు.