నరేశ్ పుట్టిన రోజు నేడు. ఆయన అసలు పేరు నరేశ్ కృష్ణమూర్తి. డాక్టర్ నరేశ్ విజయ కృష్ణగా సుపరిచితుడైన ఆయన 1960, జనవరి 20న జన్మించిన ఆయన ఆదివారం 65వ పడిలోకి అడుగుపెట్టనున్నారు. 1972లో ‘పండంటి కాపురం’ సినిమాతో బాల నటుడిగా సినీరంగ ప్రవేశం చేశారు.
తన తల్లి విజయ నిర్మల దర్శకత్వంలో 1982లో వచ్చిన ‘ప్రేమ సంకెళ్లు’ చిత్రంతో కథానాయకుడిగా మారారు. ‘నాలుగు స్తంభాలాట’, ‘హై హై నాయక’, ‘శ్రీవారికి ప్రేమలేఖ’, ‘చిత్రం భళారే విచిత్రం’ వంటివి ఆయన నటించిన సినిమాల్లో చెప్పుకోదగ్గవి. ముఖ్యంగా ఫిల్మోగ్రఫీలోని ‘జంబలకిడి పంబ’ అత్యధిక వసూళ్లు సాధించిన హాస్య చిత్రంగా నిలిచింది. హాస్య ప్రధాన చిత్రాలతో నటిగా మంచి పేరు తెచ్చుకున్న ఆయన ప్రస్తుతం సహాయక నటుడి పాత్రల్లో మెప్పిస్తున్నారు.