calender_icon.png 15 January, 2025 | 2:23 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

బస్సులో జన్మించిన బిడ్డకు బర్త్ సర్టిఫికెట్

07-07-2024 12:03:14 AM

జీవిత కాలం ఉచిత బస్‌పాస్ 

కండక్టర్‌ను సత్కరించిన ఆర్టీసీ ఎండీ సజ్జనార్ 

హైదరాబాద్ సిటీబ్యూరో, జూలై 6 (విజయక్రాంతి): గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోని ఆరాంఘర్‌లో 1 జెడ్ నంబర్ ఆర్టీసీ బస్సు లో శుక్రవారం శ్వేతారత్నం అనే మహిళకు పురిటినొప్పులు రావడాన్ని గమనించిన కండక్టర్ తోటి ప్రయాణికులతో కలిసి ఆర్టీసీ బస్సులోనే ప్రసవం చేసిన విషయం తెలిసిందే. బస్సులో ప్రయాణిస్తున్న శ్వేతా రత్నంకు బహూదూర్‌పురా దగ్గరకు రాగానే పురిటి నొప్పులు వచ్చాయి. ఈ సమయం లో చాకచక్యంగా వ్యవహరించిన కండక్టర్, మిగతా ప్రయాణికుల సహాయంతో ప్రస వం చేశారు.

దీంతో జీహెచ్‌ఎంసీ ఉన్నతాధికారుల చొరవతో 1969 బర్త్ అండ్ డెత్ చట్ట ప్రకారం ఏ స్థలంలో జన్మిస్తే ఆ స్థలానికి సంబంధించిన రిజిస్ట్రార్ బర్త్ సర్టిఫికెట్ జారీ చేయాలనే నిబంధన ఉన్నందున.. జీహెచ్‌ఎంసీ అధికారులు బేబీ ఆఫ్ శ్వేతారత్నం అనే పేరుతో బర్త్ సర్టిఫికెట్‌ను అందజేసినట్టు సీఎంవోహెచ్ డాక్టర్ పద్మజ తెలిపారు. ఇదిలా ఉండగా, పురిటి నొప్పులతో బాధపడుతున్న మహిళకు ఇబ్బందులు లేకుండా చర్యలు చేపట్టి కాన్పు సజావుగా అయ్యేలా కృషి చేసిన కండక్టర్‌ను ఆర్టీసీ ఎండీ వీసీ సజ్జనార్ శనివారం అభినందించారు. ఆమెను శాలువాతో సత్కరించి బహుమతిని అందజేశారు. అనంతరం బస్సులో జన్మించిన బిడ్డకు జీవిత కాలం ఉచిత బస్సు పాస్‌ను జారీ చేశారు.