03-04-2025 08:56:52 PM
బిచ్కుంద (విజయక్రాంతి): కామారెడ్డి జిల్లా బిచ్కుంద మండలం దౌలత్ పూర్ గ్రామంలోని మల్లన్న మందిరం ముందు తెలంగాణ సాయుధ పోరాట స్ఫూర్తి ప్రదాత దొడ్డి కొమరయ్య జయంతి గ్రామ మాజీ సర్పంచ్ సాయి గొండ అధ్యక్షతన జయంతి కార్యక్రమం జరిగింది.
ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా సిఐటియు జిల్లా కమిటీ సభ్యులు సురేష్ గొండ మాట్లాడుతూ... దొడ్డి కొమరయ్య తెలంగాణ సాయుధ పోరాటంలో కీలకపాత్ర పోషించిన తెలంగాణ మరో భగత్ సింగ్ లాగా అతి చిన్న వయసుడైన 19 సంవత్సరంలో ఆంగ్లేయులను రజాకారులను ఎదిరించిన మరో పోరాటయోధుడని, దొడ్డి కొమరయ్య మన కురుమ కుల బాంధవులందరికీ ఆదర్శ పోరాటయోధుడని మనమందరం దొడ్డి కొమరయ్యని ఆదర్శంగా తీసుకొని మన కుల సోదరుల ఐక్యతకై మన హక్కులకై మన కురుమ కులాస్తులందరిని ఎస్టిలుగా గుర్తింపు పొందే వరకు మనమందరం ఐక్యంగా పోరాడాల్సిన అవసరం ఎంతైనా ఉన్నదని అన్నారు.
ఈ సందర్భంగా సురేష్ గొండ కురుమ కుల బాంధవులందరికీ విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో గుండె కల్లూరు గ్రామ మాజీ సర్పంచ్ సాయి గొండ, దౌతాపూర్ గ్రామ కుల బంధువులు, నాగ గొండ మహారాజ్, మొగుల గొండ, హనుమంతరావు, లక్ష్మణ్, వీరేశం, గంగారం తదితరులు పాల్గొన్నారు.