calender_icon.png 16 April, 2025 | 7:25 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్134 జయంతి

14-04-2025 11:07:33 PM

బాన్సువాడ (విజయక్రాంతి): భారత రాజ్యాంగ నిర్మాత, భారతరత్న, డా. బి. ఆర్ అంబేద్కర్ జయంతిని సోమవారం పురస్కరించుకొని బాన్సువాడ మండల కేంద్రంలో డాక్టర్ బాబా సాహెబ్ అంబేద్కర్ 134వ జయంతి సందర్భంగా ఆయన విగ్రహానికి పూలమాల వేసి ఘననివాళి అర్పించిన బిజెపి నాయకులు. ఈ సందర్భంగా బిజెపి నాయకులు మాట్లాడుతూ.. అంటరానితనం, వివక్షలపై అలుపెరుగని పోరాటం చేసి, అస్తిత్వ ఉద్యమాలకు దశదిశలను చూపిన స్ఫూర్తి ప్రదాత.భారత రాజ్యాంగ నిర్మాత, భారతరత్న స్ఫూర్తిప్రదాత డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ అని బిజెపి నాయకులు అన్నారు. ఈ కార్యక్రమంలో బిజెపి జిల్లా ఉపాధ్యక్షులు లక్ష్మీనారాయణ బిజెపి జిల్లా కార్యదర్శి శంకర్ గౌడ్ బిజెపి సీనియర్ నాయకులు చిదుర సాయిలు శ్రీనివాస్ రెడ్డి కొనాల గంగారెడ్డి పాశం భాస్కర్ రెడ్డి చీకట్ల రాజు చిరంజీవి వెంకట్ శంకర్ గంగారం ఉమేష్ లక్ష్మణ్ భూమేష్ సంతోష్ తదితరులు పాల్గొన్నారు.