మెదక్ ఎంపీ రఘునందన్‌రావు
మెదక్, నవంబర్ 15 (విజయక్రాంతి): గిరిజన సంక్షేమ శాఖ ఆధ్వ ర్యంలో శుక్రవారం మెదక్ కలెక్టరేట్లో ఏర్పాటు చేసిన ధర్తీ ఆబా భగ వాన్ బిర్సా ముండా జయంతి వేడుకలకు జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్, మెదక్ ఎంపీ రఘునందన్‌రావు హాజరయ్యారు. ఎంపీ మాట్లాడుతూ.. గిరిజన బిడ్డల అభ్యున్నతి, ఆదివాసీ హక్కుల కోసం పోరాడిన మహనీయుడు బిర్సా ముండా అని కొనియాడారు. అదనపు కలెక్టర్నగేశ్, గిరిజన సంక్షేమ శాఖ స్పెషల్ అధికారి ఇందిర, జెడ్పీ సీఈవో ఎల్లయ్య, జిల్లా గిరిజన అభివృద్ధి అధికారి నీలిమ, హాస్టల్ వెల్ఫేర్ అధికారులు, గిరిజన నాయకులు, విద్యార్థులు పాల్గొన్నారు.