కనువిందు చేస్తున్న వివిధ జాతుల పక్షులు
కుమ్రంభీం ఆసిఫాబాద్, జనవరి 18 (విజయక్రాంతి): కుమ్రంభీం ఆసిఫాబాద్ జిల్లాలో దట్టమైన అడవులతో పాటు అందమైన కొండలు, జల జల పారే జలపాతాల కనువిందు చేస్తాయి. శీతకాలంలో హిమాలయలతో పాటు భారత సరిహద్దు దేశాల నుంచి అనేక జాతుల పక్షులు ఇక్కడకు వలస వస్తుంటాయి.
వలస వస్తున్న పక్షులను గుర్తించిన ఫారెస్ట్ శాఖ అధికారులు జిల్లాలో 2019లో బర్డ్ ఫెస్టివల్ ఏర్పాటు చేసి పక్షి ప్రేమికులను ఆహ్వానించారు. ఆ తర్వాత 2022లో ఏర్పాటు చేయగా.. ఈ ఏడాది జనవరి 17, 18, 19 తేదీల్లో నిర్వహిస్తున్నారు. శనివారం పక్షి ప్రేమికులు కాగజ్‌నగర్ డివిజన్‌లోని సిర్పూర్(టి), బెజ్జుర్, పెంచికల్‌పేట అడవుల్లో నిర్వహించే బర్ట్‌వాక్ ఫెస్టివల్‌కు తరలిరానున్నారు.
దాదాపుగా 270 రకాల పక్షులు రావొచ్చని అధికారులు అంచనా వేస్తున్నారు. పక్షి ప్రేమికుల కోసం అన్ని ఏర్పాట్లు చేశామని జిల్లా అటవీశాఖ అధికారి రంజిత్‌కుమార్ టిబ్రేవల్ తెలిపారు.