calender_icon.png 20 January, 2025 | 4:56 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ముగిసిన బర్డ్‌వాక్ ఫెస్టివల్

20-01-2025 12:00:00 AM

కుమ్రంభీం ఆసిఫాబాద్, జనవరి 19 (విజయక్రాంతి): కుమ్రంభీం ఆసిఫాబాద్ జిల్లాలో గత మూడు రోజులుగా జరిగిన బర్డ్ ఫెస్టివల్ ఆదివారంతో ముగిసింది. ఆఖరి రోజు కాగజ్‌నగర్ మండలంలోని కోసిని డ్యామ్, వెంపల్లిలో పక్షుల విహారాన్ని పక్షి ప్రేమికులు తమ కెమెరాల్లో బంధించారు.

ఫెస్టివల్‌కు హైదరాబాద్, వరంగల్‌తో పాటు ఇతర ప్రాంతాల నుంచి పక్షి ప్రేమికులు వచ్చినట్టు డీఎఫ్‌ఓ నీరజ్ కుమార్ టిబ్రెవాల్ తెలిపారు. రెండు రోజులు 100 రకాల పక్షులను గుర్తించినట్లు తెలిపారు. ఈ యాత్రలో పాల్గొన్న పర్యాటకులకు సర్టిఫికెట్లను అందజేశారు. కార్యక్రమంలో ఎఫ్‌డీవో సుఖ్‌దేవ్ బోబడే, ఫారెస్ట్ అధికారులు రమాదేవి, శేశిధర్‌బాబు పాల్గొన్నారు.