03-04-2025 12:00:00 AM
అబ్దుల్లాపూర్‌మెట్, ఏప్రిల్ 2: రంగారెడ్డి జిల్లా, అబ్దుల్లాపూర్‌మెట్ మండలం కొత్తగూడెంలో బర్డ్‌ఫ్లూ కలలం రేపుతుంది. రాజశేఖర్‌రెడ్డి కొత్తగూడంలో ఫౌల్ట్రీ ఫారం ఉంది. గత నెల 24 తేది నుంచి ఫౌల్ట్రీ ఫారంలో ప్రతిరోజు 200 కోళ్లు చనిపోతుండడంతో రాజశేఖర్‌రెడ్డికి అనుమానం వచ్చి సంబంధిత అధికారులను సంప్రదించారు.
అధికారులు వచ్చి కోళ్ల రక్త నామూనాలను సేకరించి పరీక్షలు నిర్వహించగా... బర్ఢ్‌ఫ్లేనని నివేదిక ఇవ్వడంతో చనిపోయిన కోళ్లే కాకుం డా బ్రతికి ఉన్న కోళ్లను కూడా జేసీబీల సహయంతో గుంతలు తవ్వి అందులో వేసి పూడ్చేవేసినట్లు తెలిసింది. ఆవేదనతో ఫౌల్ట్రీ ఫారం యజమాని రాజశే ఖర్‌రెడ్డి మాట్లాడుతూ..
నా ఫౌల్ట్రీ ఫారంలో ఉన్న కోళ్ల మృత్యువాత పడడంతో కోట్లాది రూపాయల నష్టం వాటిల్లిన్నట్లు తెలిపారు. అధికారులను మీడియా ప్రతినిధులు వివరణ కోరగా స్పందించకపోగా... మీడియాకు సమాచారం ఎవ్వరు ఇచ్చారని యజమానిపై చిందులు వేశారు అధికారులు. ప్రస్తు తం ఫామ్‌లో ఉన్న కోడి గుడ్లను కూడా ఎవ్వరికీ విక్రయించొద్దని ఫౌల్ట్రీ ఫారం యజమానులకు అధికారులు సూచించినట్లు తెలిసింది.