calender_icon.png 13 February, 2025 | 3:41 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

బర్డ్ ఫ్లూ గండం!

13-02-2025 12:30:57 AM

  1. పడిపోయిన చికెన్ ధరలు 
  2. మూతపడుతున్న దుకాణాలు
  3. రాష్ట్ర సరిహద్దుల్లో 24 చెక్‌పోస్టులు ఏర్పాటు

విజయక్రాంతి నెట్‌వర్క్, ఫిబ్రవరి 12: రాష్ట్రంలో పౌల్ట్రీ పరిశ్రమను బర్డ్ ఫ్లూ గడగడలాడిస్తున్నది. ఆంధ్రప్రదేశ్‌లో లక్షలాది కోళ్లు మృత్యువాత పడు తుండటంతోపాటు చికెన్ ధరలు పడిపోయాయి. దీంతో పౌల్ట్రీ పరిశ్రమల యజమానులు, చికెన్ షాపు నిర్వాహకులు ఆందోళన చెందుతున్నారు.

బర్డ్ ఫ్లూ భయంతో రాష్ట్రవ్యాప్తంగా ఏపీ సరిహద్దుల్లో 24 చెక్‌పోస్టులు ఏర్పాటు చేశారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో మూడు చెక్‌పోస్టుల వద్ద ఏపీ నుంచి సరఫరా అవుతున్న కోళ్ల వాహనాలను అడ్డుకుని తిరిగి వెనక్కి పంపుతున్నారు. చర్ల, అశ్వారావుపేట, దమ్మపేట మండలాల వద్ద చెక్‌పోస్టులు ఏర్పాటు చేశా రు. బర్డ్ ప్లూ నేపథ్యంలో ఖమ్మం జిల్లా లో చికెన్ తినే వారి సంఖ్య తగ్గింది.

డిమాండ్‌తోపాటు ధరలు తగ్గడంతో కొన్ని చోట్ల నిర్వాహకులు చికెన్ దుకాణాలు మూసి వేస్తున్నారు. కొన్ని చోట్ల ధరలు తగ్గించి విక్రయాలు చేస్తున్నారు. వైరస్ సోకముందు కిలో చికెన్ (స్కిన్) 240 ఉండేది. స్కిన్‌లెస్ రూ. 260 దాకా ఉండేది. ఇప్పుడు కిలో రూ.140 నుంచి రూ.160 వరకు మాత్రమే అమ్ముతున్నారు.

ఖమ్మం జిల్లాలోని ఆంధ్రా సరిహద్దుల్లో పోలీస్ నిఘా పెట్టి, ఆంధ్రా నుంచి వస్తున్న కోళ్ల వా భు అడ్డుకుని, వెనక్కి తిప్పిపంపుతున్నారు. ఆసిఫాబాద్ జిల్లాలో రిటైల్‌గా కిలో  రూ.240-250 ధర పలుకుతున్నది. హోల్‌సెల్‌గా రూ.180-195 ధర పలుకుతున్నది. తెలంగాణ సరిహద్దులో ఉండే ఆదిలాబాద్ జిల్లా బోరజ్ జాతీయ ర దాణూరిపై చెక్‌పోస్ట్ ఏర్పాటు చేశారు.

మహారాష్ర్టతో పాటు ఇతర రాష్ట్రాల నుంచి కోళ్లు తెలంగాణకు రాకుండా అడ్డుకుంటున్నారు. ఉమ్మడి నల్లగొండ జిల్లాలోనూ చికెన్ ధర  తగ్గాయి. మొన్నటి వరకు కేజీ చికెన్ రూ.200-200 వరకు ఉండగా బుధవారం రూ.150 నుంచి రూ.170 వరకు విక్రయించారు. హోటళ్లు, ఫాస్ట్‌ఫుడ్ సెంటర్లలో బి  చికెన్ వంటకాల అమ్మకాలు సైతం తగ్గాయి.

జిల్లావ్యాప్తంగా పౌల్ట్రీ ఫాంలను పశువైద్యాధికారులు పరిశీలించారు. కోళ్లు మరణిస్తే వాటిని బయట పడేయకుండా జాగ్రత్తగా పూడ్చాలని సూచించారు. ఉమ్మ  జిల్లాలోని మూడు సరిహద్దు చెక్‌పోస్టుల వద్ద ఏపీ నుంచి కోళ్ల వాహనాలు రాకుండా అధికారులు కట్టుదిట్టమైన చర్యలు తీసు యు కోదాడ మండలం రామాపురం అం  చెక్‌పోస్టు వద్ద ఓ లారీని అడ్డుకొని వెనక్కి పంపారు. దామరచర్ల మం  వాడపల్లి, నాగార్జునసాగర్ చెక్‌పోస్టుల వద్ద సైతం పలు వాహనాలను అడ్డుకున్నారు.