01-03-2025 06:04:46 PM
పటాన్ చెరు: జిల్లాలోనే ప్రముఖ శైవ క్షేత్రమైన బీరంగూడ భ్రమరాంబ మల్లికార్జున స్వామి ఆలయ హుండీని శనివారం లెక్కించారు. ఆలయ ఈవో శశిధర్ గుప్తా, స్పెషల్ ఆఫీసర్ అన్నపూర్ణ, జూనియర్ అసిస్టెంట్ మల్లికార్జున్ రెడ్డి, ఆలయ కమిటీ ఆధ్వర్యంలో హుండీని లెక్కించగా హుండీ ఆదాయం ఆరు లక్షల 18 వేల 694 వచ్చాయి. టికెట్ల ద్వారా ఇరవై లక్షల 50వేలు, టెండర్ల ద్వారా ఇరవై లక్షల 82వేల 116 వచ్చినట్లు ఆలయ ఈవో శశిధర్ గుప్తా, ఆలయ కమిటీ చైర్మన్ సుధాకర్ యాదవ్ తెలిపారు. శివరాత్రి ఉత్సవాల సందర్భంగా ఆలయానికి మొత్తం రూ.47,99,283 వచ్చినట్లు తెలిపారు. హుండీ లెక్కింపు కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు, ఆలయ సిబ్బంది పాల్గొన్నారు.