28-03-2025 02:00:51 AM
కమిషనర్ ఆదేశం
కరీంనగర్ సిటీ, మార్చి27 (విజయక్రాంతి): బయోమైనింగ్ ప్రక్రియను నిరంతరంగా కొనసాగించాలని ఏజెన్సీ కాంట్రాక్టర్ ను కమీషనర్ చాహాత్ బాజ్ పాయ్ ఆదేశించారు. స్వఛ్ఛ్ సర్వేక్షన్ లో భాగంగా నగరంలోని హౌసింగ్ బోర్డు, కోతిరాంపూర్ లో పర్యటించారు. హౌజింగ్ బోర్డులోని నగరపాలక సంస్థ కు చెందిన రీసోర్స్ పార్కును సందర్శించి... నూతనంగా అభివృద్ధి చేస్తున్న ఆర్ ఆర్ ఆర్ సెంటర్ తో పాటు స్థానికంగా ఉన్న డీఆర్ సీసీ సెంటర్, వర్మికంపోస్టు ఫిట్స్ ను తనిఖీ చేసి పరిశీలించారు. అనంతరం కోతిరాంపూర్ నగరపాలక సంస్థ డంపు యార్డును సందర్శించి... తనిఖీ చేశారు. స్థానికంగా ఉన్న డీఆర్ సీసీ సెంటర్ తో పాటు బయోమైనింగ్ ప్రక్రియను పరిశీలించారు.
కొత్తగా అభివృద్ధి చేస్తున్న ఆర్ ఆర్ ఆర్ సెంటర్, నూతన కాంపోస్ట్ ఫిట్స్ పెండింగ్ పనులను త్వరగా పూర్తి చేయాలని ఆదేశించారు. స్థానికంగా ఉన్న డీఆర్ సీసీ సెంటర్ లో సెక్రిగేషన్ ప్రక్రియను కొనసాగించి...తడి చెత్త వ్యర్థాలతో కాంపోస్ట్ ఎరువులు తయారు చేయాలని ఆదేశించారు. డంపు యార్డులో బయో మైనింగ్ ప్రక్రియను నిరంతంగా కొనసాగించి... డైలీ రిపోర్ట్ అందించాలన్నారు. గల కాంపోస్ట్ ఫిట్స్ లలో కూరగాయలు వ్యర్థాల ద్వారా సేంద్రీయ ఎరువులను తయారు చేయాలని ఆదేశించారు. ఆర్ ఆర్ ఆర్ సెంటర్ పనులు పూర్తి చేసి.. సెక్రిగేషన్ ప్రాపర్‌గా జరిగేలా చూడాలన్నారు. ఈ కార్యక్రమంలో ఎన్విరాన్మెంట్ ఇంజనీర్ స్వామీ తదితరులు పాల్గొన్నారు.