13-02-2025 12:00:00 AM
ప్రారంభించిన మంత్రి తుమ్మల
కల్లూరు, ఫిబ్రవరి 12 ః తల్లాడ పట్టణంలో మల్లవరం రూట్‌లో ఏర్పాటు చేసిన బయో మాస్ ప్లాంట్‌ను రాష్ర్ట వ్యవసా య శాఖ మాత్యులు తుమ్మల నాగేశ్వరరావు బుధవారం ప్రారంభించి యాజమాన్యానికి శుభాకాంక్షలు తెలియజేశారు. అనంతరం యాజమాన్యం మంత్రికి ఫ్యాక్టరీలో జరిగే పనుల గురించి వివరించడం జరిగింది.
ఈ కార్యక్రమంలో రాష్ర్ట కాంగ్రెస్ పార్టీ నాయకులు డాక్టర్ మట్టా దయానంద్ విజయ కుమార్, గుడివాడ శాసనసభ్యులు వెనిగండ్ల రాము, ఖమ్మం జిల్లా కాంగ్రెస్ పార్టీ నాయకులు, తల్లాడ మండల కాంగ్రెస్ పార్టీ నాయకులు తదితరులు పాల్గొన్నారు.