calender_icon.png 16 March, 2025 | 3:50 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఘన వ్యర్థాలతో బయోగ్యాస్

17-12-2024 12:09:13 AM

ఓయూ గర్ల్స్ హాస్టల్‌లో 

ప్లాంట్‌ను ప్రారంభించిన వీసీ

హైదరాబాద్ సిటీబ్యూరో, డిసెంబర్ 16 (విజయక్రాంతి): ఉస్మానియా యూనివర్సి టీలోని వివిధ హాస్టళ్లు, క్యాంటీన్లలో ఉత్పన్న మయ్యే ఘన వ్యర్థాల నిర్వహణలో ఓయూ మరో ముందడుగేసింది. కేపీఎంజీ, ఆహుజా ఇంజినీరింగ్ ప్రైవేట్ లిమిటెడ్, సాహస్ స్వచ్ఛంద సంస్థ సహకారంతో ఓయూ గర్ల్స్ హాస్టల్ ఏర్పాటు చేసిన బయోగ్యాస్ ప్లాంట్‌నుసోమవారం ఓయూ వీసీ కుమార్ మొలుగారం ప్రారంభించారు. ఆయన మాట్లాడుతూ.. క్యాంపస్‌లో బయోగ్యాస్ ప్లాంట్ ఏర్పాటు అభినందనీయమన్నారు.

వర్సిటీ అనుబంధ కాలేజీల్లోనూ ఇలాంటి ప్లాంట్లనుఏర్పాటు చేయాలని సూచించారు. ఈ బయోగ్యాస్ ప్లాంట్‌లో రోజూ 2 టన్నుల ఆహార పదార్థాల నుంచి పర్యావరణహిత బయోగ్యాస్‌గా ఉత్పత్తి అవుతుంది. ఇది 6 సిలిండ ర్లకు సమానం. ప్రతీ నెల 85 టన్నుల మేర ఉద్ఘారాలను తగ్గించే అవకాశంఉంది. ఓయూ రిజిస్ట్రార్ ప్రొఫెసర్ నరేశ్‌రెడ్డి, ఓఎస్డీ ప్రొఫెసర్ జితేంద్రకుమార్ నాయక్, జీవవైవిద్య విభాగం డైరెక్టర్ ప్రొఫె సర్ సీ శ్రీనివాసులు, మహిళా హాస్టల్ డైరెక్ట ర్ డాక్టర్ కల్యాణలక్ష్మి, చీఫ్ వార్డెన్ డాక్టర్ జీ శ్రీనివాసరావు పాల్గొన్నారు.