calender_icon.png 2 February, 2025 | 3:24 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

చిత్తడి నేలలతో జీవవైవిధ్యం

02-02-2025 01:10:14 AM

* రాష్ట్ర అటవీ, పర్యావరణ శాఖ మంత్రి కొండా సురేఖ  

హైదరాబాద్, ఫిబ్రవరి 1 (విజయక్రాంతి):  చిత్తడి నేలలు జీవ వైవిధ్యానికి ఆలవాలంగా ఉన్నాయని,  పర్యావరణ అసమతుల్యత తో తలెత్తే దుష్ప్రభావాలను  అరికట్టడంలోనూ, నీటి నాణ్యతను పెంచడంలోనూ చిత్తడి నేలలు వడపోత వ్యవస్థగా పనిచేస్తున్నాయని రాష్ట్ర అటవీ, పర్యావరణ శాఖ మంత్రి కొండా సురేఖ చెప్పారు.

ఈమేరకు శనివారం ఒక ప్రకటనలో మంత్రి పేర్కొన్నారు. ఐక్యరా జ్యసమితి అనుబంధ సంస్థ యునె స్కో ఆధ్వర్యంలో ఈ ఏడాది ‘మన భవిష్యత్తు కోసం చిత్తడి నేలల పరిరక్షణ’ అనే నేపథ్యంతో ప్రపంచవ్యా ప్తంగా చిత్తడి నేలల పరిరక్షణకు అన్ని దేశాలు అవగాహన కార్యక్రమాలను నిర్వహిస్తు న్నాయని పేర్కొన్నారు.

రాష్ర్టంలోని మంజీర రిజర్వాయర్, పాకాల సర స్సు, కిన్నెరసాని రిజర్వాయర్, రామ ప్ప సరస్సు, అమీన్‌పూర్ సరస్సులను చిత్తడి నేలలుగా గుర్తించినట్లు మంత్రి వివరించారు. తెలంగాణ ప్రభుత్వం త్వరలో రూపొందించనున్న ఎకో టూ రిజం పాలసీలో నూ చిత్తడి నేలలకు ప్రాధాన్యం ఇవ్వనున్నట్లు తెలిపారు.