2 నుంచి ప్రపంచ వన్యప్రాణి వారోత్సవాలు :
మనిషికి ఊపిరితిత్తులు ఎం త ముఖ్యమో భూగోళ పర్యావరణానికి అటవీ సంపద అంతే ప్రధానం. అటవీ సంపదలో దట్టమైన హరిత సంపదలు, అందులో అంతర్భాగమైన జీవజాతులు లేదా వన్య ప్రాణులు వస్తాయి. అడవుల్లో ఉండే జంతు వృక్షజాలం మానవాళికి వెలకట్టలేని మేలును చేస్తున్నది.
మానవ ప్ర మేయం లేకుండా స్వతంత్రంగా అడవులలో జీవించే జంతుజాలాన్ని వన్య ప్రాణులుగా పిలుస్తారు. వన్యప్రాణు ల్లో భారీ ఏనుగులు, జిరాఫీలు, రైనోలతో మొదలు పక్షులు, క్రిమికీటకాలు, సూక్మజీవులు వస్తాయి. 1952 లో ఏర్పాటు చేసిన భారత జాతీయ వన్యప్రాణుల మండలి చొరవతో వన్య ప్రాణి సంరక్షణ చట్టం- -1972ను తీసుకువచ్చి దేశవ్యాప్తంగా వన్యప్రాణి సం రక్షణ కార్యక్రమాలు ఉద్యమంలా సాగుతున్నాయి.
వన్యప్రాణి ప్రాముఖ్యతను ప్రజలకు వివరించే సదుద్దేశంతో ప్రతి ఏటా భారత ప్రభుత్వం అక్టోబర్ 2 నుండి 8 వరకు ప్రపంచ వన్యప్రాణి వారోత్సవాలను ప్రతిష్టాత్మకంగా చేబడుతున్నది.
ఈ వారోత్సవాలలో వన్యప్రాణి పరిరక్షణకు తీసుకోవలసిన చర్యలు, చట్టాల అమలులో పటిష్టత, అవసరమైన నూతన చట్టాల రూపకల్పన, జీవ సంరక్షణ అవసరం, అభయారణ్యాల ఏర్పాటు, జాతీయ ఉద్యానవ నాల స్థాపన, అడవుల నరివేతను వ్యతిరేకించడం వంటి అంశాలలో లోతైన చర్చలు జరుగుతుంది.
భారత దేశ అడవుల్లో 91,797 రకాలైన జంతుజాతులు, 46,340 రకాల వృక్షజాతులు ఉన్నాయి. వీటికి తోడుగా 2,634 రకాల జలజాతుల సంపద మన దేశంలో ఉన్నది. ప్రపంచంలోని జీవజాతుల్లో 80 శాతం వరకు జీనవైవిధ్యం కలిగిన జంతు సంపద మన దేశంలోనే ఉంది. వీటిలో క్షీరదాలు, పక్షులు, సరీసృపాలు, ఉభయచరాలు లాంటి జీవులు మన అడవులకు, మానవాళికి ఎనలేని సేవలందిస్తున్నా యి.
ఉత్తరాన హిమాలయాల నుండి దక్షిణాన కేరళ అడవుల వరకు అపార జీవ వైవిధ్యంతో అసంఖ్యాక జంతుజాలం మన అడవుల సౌందర్యాన్ని ఇనుమడింపజేస్తున్నాయి. మన జాతీయ జంతువుగా టైగర్, జాతీయ పక్షిగా నెమలి గుర్తించబడ్డాయి.
భూమిని నివాసయోగ్య గ్రహంగా కాపాడుకున్నపుడే భవిష్యత్ తరాలు పర్యావరణ పరిరక్షణతో ఆరోగ్యకర వాతావరణంలో నివసించగలుగుతారు. జీవకోటి సమతుల్యత, జీవ వైవిధ్య సాధనకు వన్యప్రాణులను కాపాడుకోవడం మనందరి బాధ్యత అని గుర్తించాలి.
- డా. బుర్ర మధుసూదన్ రెడ్డి
9949700037