01-04-2025 02:07:49 AM
ఎంపీ కొండా విశ్వేశ్వర్‌రెడ్డి
హెచ్‌సీయూ భూముల విక్రయంపై రాష్ట్ర ప్రభుత్వం పునరాలోచించాలని ఎంపీ కొండా విశ్వేశ్వర్‌రెడ్డి కోరారు. 50 ఏళ్లుగా ఆ భూములు జీవ వైవిధ్యానికి ఆలవాలంగా ఉన్నాయన్నారు.ఆ భూములను విక్రయించాలనుకోవడం ఏమాత్రం సరికాదన్నారు. సోమవారం బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో మాట్లాడుతూ హెచ్‌సీయూ భూముల్లో పచ్చదనం పరుచుకుం దని, ఎన్నో జంతువులు అక్కడ జీవిస్తున్నాయని చెప్పారు. రాష్ర్ట ఆర్థికపరిస్థితి బాగోలేదని వర్సిటీ భూములు అమ్ముకోవండం ఏమిటని ప్రశ్నించారు. అధికారంలో ఉన్నప్పుడు విలువైన భూములను విక్రయి ంచారంటూ బీఆర్‌ఎస్‌పై మండిపడ్డారు.