calender_icon.png 25 November, 2024 | 1:52 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఇండియన్ బ్యాంక్ కొత్త సీఈవోగా బినోద్ కుమార్!

25-11-2024 12:06:28 AM

ఎఫ్‌ఎస్‌ఐబీ సిఫార్సు

న్యూఢిల్లీ, నవంబర్ 24: ప్రభుత్వ రంగ ఇండియన్ బ్యాంక్ మేనేజింగ్ డైరెక్టర్, చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ పోస్టుకు బినోద్ కుమార్‌ను ఫైనాన్షియల్ సర్వీసెస్ ఇనిస్టిట్యూషన్స్ బ్యూరో (ఎఫ్‌ఎస్‌ఐబీ) సిఫార్సుచేసింది. ప్రస్తుతం పంజాబ్ నేషనల్ బ్యాంక్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్‌గా వ్యవహరిస్తున్న బినోద్ కుమార్.. వచ్చే నెలలో పదవీ విరమణ చేయనున్న ఇండియన్ బ్యాంక్ ప్రస్తుత సీఈవో ఎస్‌ఎల్ జైన్ స్థానంలో బాధ్యతలు చేపడతారు.

ప్రభుత్వ రంగ బ్యాంక్‌లు, ఆర్థిక సంస్థల డైరెక్టర్లను ఎంపికచేసే ఎఫ్‌ఎస్‌ఐబీ ఇండియన్ బ్యాంక్ సీఈవో ప్రక్రియను ఆదివారం ఒక ప్రకటనలో తెలిపింది. ఈ పోస్టుకు 15 మందిని ఇంటర్వ్యూ చేశామని, వారి మొత్తం పనితీరు, అనుభవం, ఇతర ప్రమాణాల ఆధారంగా ఇండియన్ బ్యాంక్ ఎండీ, సీఈవోగా బినోద్ కుమార్‌ను సిఫార్సుచేసినట్లు బ్యూరో వెల్లడించింది. ప్రధాన మంత్రి నరేంద్ర మోది నేతృత్వంలోని నియామకాల క్యాబినెట్ కమిటీ ఎఫ్‌ఎస్‌ఐబీ సిఫా ర్సుపై తుది నిర్ణయాన్ని తీసుకుంటుంది.