వాషింగ్టన్: తైవాన్ రక్షణ కోసం అమెరికా తన అత్యున్నత దళానికి రహస్యంగా శిక్షణ ఇస్తోంది. ఈ దళం గతంలో పాక్ భూభాగం లోకి చొచ్చుకెళ్లి మరీ ఒసామా బిన్ లాడెన్ ను చంపేసింది. ఇటీవల కాలంలో తైవాన్ కు తరచుగా పెంటగాన్ నుంచి ప్రత్యేక రక్షణ బృందాలు వెళుతున్నట్టు ఫైనాన్షియల్ టైమ్స్ కథనంలో వెల్లడించింది. ఆ దేశ సైన్యానికి కూడా ఇవి ప్రత్యేక శిక్షణ ఇస్తున్నట్లు పేర్కొంది. ఈ బృందాలు వర్జీనియా బీచ్ లోని ప్రధాన స్థావరం డామ్ నెక్ వద్ద శిక్షణ పొందుతున్నారు.తమ వార్షక బడ్జెట్ లో 20 శాతం అమౌంట్ ను చైనా ముప్పును ఎదుర్కోవటానికి ఖర్చు పెడుతున్నట్లు సీఐఏ డైరెక్టర్ బిల్ బర్న్స్ పేర్కొన్నారు.