17-12-2024 12:09:23 AM
రూ.10 వేల జరిమానా
కామారెడ్డి, డిసెంబర్ 16 (విజయక్రాంతి): సారా విక్రయిస్తూ పట్టు బడిన మాచారెడ్డి మండలం గజ్యానాయక్ తండాకు చెందిన లావుడ్యా లాలిని గతంలో ఎక్సైజ్ అధికారులు తహసీల్దార్ ఎదుట బైండోవర్ చేశారు. అయితే మళ్లీ సారా విక్రయిస్తూ బైండోవర్ ఉల్లంఘనకు పాల్పడినందుకు లాలికి తహసీల్దార్ సోమవారం రూ.10 వేల జరిమానా విధించారు. నాటు సారా తయారు చేసినా, రవాణా చేసినా, బైండోవర్ ఉల్లంఘించినా కఠిన చర్యలు ఉంటాయని కామారెడ్డి ఎక్సైజ్ సీఐ విజయ్‌కుమార్ హెచ్చరించారు.